Tuesday, February 9, 2016

మనసు బాధగా ఉన్నపుడు అది తగ్గా లంటే ఏమి చేయాలి ?

ప్ర . మనసు బాధగా  ఉన్నపుడు  అది  తగ్గా  లంటే ఏమి చేయాలి ?
జ . మనసు బాధగా  ఉన్నపుడు  అది తగ్గాలంటే  6 ముఖ్యమైన  చిట్కాలున్నాయి . అవి ,
01. బాగా  ఏడుపు వస్తే  , ఆపుకోకుండా  ఏడువాలి . కొంచెం   మనసు బరువు తగ్గి , బాధ  తగ్గు తుంది . 
02. లేదా , నమ్మకం గల  వారికి , ఇష్టమైన వారికి  , దగ్గరి బందువులకు , బాధలు చెప్పుకుంటే , మనసు బరువు తగ్గి , బాధ తగ్గుతుంది . వారు ధైర్యం చెప్పవచ్చు , సలహాలు ఇవ్వవచ్చు , పరిష్కార మార్గాలు సూచించ వచ్చు .  
03. లేదా , ఒక తెల్ల కాగితం తీసుకుని , బాధలన్నీ  వ్రాసుకుని  , కాగితాన్ని చింపివేసినా  మనసు బరువు తగ్గి , ప్రశాంతత  ఏర్పడుతుంది . 
04. లేదా , మనసు మరల్చి , పిల్లలతో ఆడుకోవడమో , లేదా ఇతర పనులమీద ద్యాస  పెట్టడమో చేసినా , బాధను మర్చి పోయి , మనసుకు  ప్రశాంతత ఏర్పడుతుంది . 
05. లేదా , ఏకాంతంగా  కూర్చొని ,  పాజిటివ్ గా  , నవ్వును  మదిలో నిలుపుకుని  " నేను  సంతోషంగా ఉన్నాను , నాకు ఎలాంటి  బాధలు లేవు , నేను ఆరోగ్యంగా ఉన్నాను , బాధలు అనేవి  అందరికి సహజం , కాలమే అన్నిటిని  పరిష్కరిస్తుంది " అనుకుంటూ   ఒక అరా గంట  ధ్యానం చేస్తే , మనసు కుదుట పడి , బాధ మాటు మాయ మవుతుంది . 
06. లేదా  ఇష్ట  దైవాన్ని లేదా నమ్మిన శక్తిని   ప్రార్ధిస్తూ  ఒక అర గంట  సేపు  ధ్యానం చేసినా మనసు కుదుట పడి , బాధ మటు మాయ మవుతుంది  .  
లేదా  అన్నీ ప్రయత్నించ వచ్చు . ప్రయత్నించి చూడండి . విజయోస్తు !.   

No comments: