Thursday, March 3, 2016

సక్రమ సంపాధనకు (JUSTIFIED EARNINGS), అక్రమ సంపాదనకు (UN JUSTIFIED EARNINGS) తేడా ఏమిటి ? వాటి పరిణామాలు ఏమిటి ?

ప్ర . సక్రమ సంపాధనకు (JUSTIFIED EARNINGS) , అక్రమ సంపాదనకు (UN JUSTIFIED EARNINGS) తేడా ఏమిటి ? వాటి పరిణామాలు ఏమిటి ?

జ . సక్రమ సంపాదన(JUSTIFIED EARNINGS) అనగా , కష్ట పడి , నిజాయితీగా సంపాదించి పొదుపు చేసుకునేది . నీతి వంతంగా వ్యాపారాలు చేసి సంపాదించినది . చట్ట పరంగా , వివిధ కారణాల వలన ప్రభుత్వ సహాయం , ప్రభుత్వ ఉద్యోగాలు పొంది సంపాదించినది. చట్ట బద్దంగా , నిజాయితీగా , వార సత్వంగా సంక్రమించే సంపదలన్నీ , ఆస్తులన్నీ కూడా  సక్రమ సంపద గానే భావించాలి .
అక్రమ సంపాదన(UN JUSTIFIED EARNINGS) అనగా , కష్ట పడి నిజాయితీగా సంపాదించ కుండా , దోచు కోవడం , మోసం చేసి సంపాదించడం , అక్రమ దారిలో లంచాలు కట్టి , దొంగ ధ్రువ పత్రాలు పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం , అక్రమ వ్యాపారాలు చేసి , మోసాలతో కోట్లకు పడగ లెత్తడం , రాజకీయ కార్య కర్తలుగా , రాజకీయ నాయకులుగా , మంత్రులుగా ఎదిగి వేలాది కోట్ల ప్రజల సొమ్ము , ప్రభుత్వ ఆస్తులను వెనుకేసుకోవడం , నాయకుల అండతో , చట్టాలలోని లోసుగులతో , మరికొంత మంది అధికారులు , కోట్లాది సొమ్మును సంపాదించడం, రిజర్వేషన్లను  అనుభవించే  కొన్ని XYZ కులాల వారు , వాటిని దుర్వినియోగం  చేస్తూ  మరల మరల  అధిక మొత్తంలో  లబ్ధి పొందే వాటిని  అక్రమ సంపాదన అంటారు , వీరు సంపాదించిన సొమ్మును , ఆస్తులను బినామీ పేర్లపై ఆస్తులు కొనడం , బ్యాంక్ లాకర్లలో దాయడం , ఎఫ్ .డి . ఐ , రూపాలలో పెట్టుబడులు పెట్టడం , విదేశీ బ్యాంకులలో దాయడం , షేర్లల్లో , మ్యూచువల్ ఫండ్లల్లో పొదుపు చేయడం , ఇన్స్యూరెన్స్ పాలసీలలో పొదుపు చేయడం , విదేశీ స్వదేశీ  కంపనీలలో  , మాల్స్ లలో  పెట్టుబడులు పెట్టడం , ట్రస్టులలో  పొదుపు చేయడం ,  లగ్జరీగా జీవించడం , పిల్లలను భారీ ఖర్చుతో విదేశాలలో చదివించడం , విదేశాలలో ఆస్తులు  సంపాదించడం , చంద్ర  మండలంలో  భూములు కొనడం చేస్తుంటారు . 

సక్రమ సంపాధన , అక్రమ సంపాదన . వాటి పరిణామాలు:
----------------------------------------------------------


" పుట్టిన వాడు  గిట్టక తప్పదు "  అన్నట్లు ,  మనిషి భూమి మీద  ఏమి సంపాదించినా , ఎలా సంపాదించినా ,  మల్లీ  అదే భూమి మీద  విడిచి వెల్లాల్సిందే .  పుట్టే డపుడు ఎవరూ ఏమి తీసుకుని రారు . అలానే , ఆ తరువాత కాలంలో ఎవరు ఏ రూపాన సంపాదించినా , ఏ వారసత్వ రూపంలో వచ్చినా , పోయే టప్పుడు , నడుముకు కట్టుకున్న మొల్దారం కూడా తీసుక పోరు సక్రమ సంపాదన వలన సుఖముండక పోవచ్చు గాని ఎంతో తృప్తి ఉంటుంది . కొందరు పేద తనం లో జీవించ వచ్చు గాని  వారిలో ఎంతో ఆనందం ఉంటుంది . ఎంతో మనఃశ్సాంతి ఉంటుంది . మరెంతో సంతోష ముంటుంది . ఎలాంటి భయ ముండదు . సమాజంలో శాశ్విత గౌరవ ముంటుంది . వారు చేసే సేవలను బట్టి , మంచి పనులను బట్టి గుర్తింపు దక్కుతుంది .
నిండా నూరేళ్ళు ( అనుకోని సంఘటనల వలన తప్పా ) హాయిగా జీవించ వచ్చు .అక్రమ సంపాదన వలన , సుఖముండ వచ్చు గాని , తృప్తి ఉండదు . హాయి ఉండ వచ్చు గాని , ఆనందముండదు . తాత్కాలికంగా సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగ వచ్చు గాని , సంతోష ముండదు . ధనికంగా బ్రతుక వచ్చు గాని , అడుగడుగునా భయమే నీడలా వెంటాడుతుంది . మినరల్ వాటర్ తో స్నానం చేయ వచ్చు , బెంజ్ కార్లల్లో తిరుగ వచ్చు , కోట్లాది రూపాయలను , ఆస్తులను కూడ బెట్ట వచ్చు . కాని ఏదో ఒక రోజు చిప్ప కూడు తిన వలసి రావచ్చు . అంటే జైల్లోకి వెల్ల వలసి రావచ్చు . కన్న బిడ్డలు , భార్యా పిల్లలు , కష్ట కాలాలలో తోడు నిలువక పోవచ్చు . అక్రమంగా కూడా బెట్టిన ఆస్తులకోసం , కన్న బిడ్డలు , భార్యా పిల్లలు తగవు లాడు కోవచ్చు , చంపు కోవచ్చు . ఇంత కాలం చుట్టూ తిరిగిన , ఈగల్ల వాలిన బంధు మిత్రులు దూరం కావచ్చు . కోర్టుల చుట్టూ తిరుగ వలసి రావచ్చు . దాని కోసం మరల జ్యోతిష్యుల కొరకు , వాస్తు దోషాల కొరకు లక్ష లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి రావచ్చు . ఆ విధంగా ఆస్తులన్నీ తూడ్చి పెట్టుక పోవచ్చు . భార్యా పిల్లలు రోడ్డు మీద పడవచ్చు . పేరు ప్రతిష్టలు మంటలో కలువ వచ్చు . అవార్డులు , రివార్డులు గంగలో కలువ వచ్చు . ఎదుటి వారు చూసే చూపులు , సూదుల్లా గుచ్చుకోవచ్చు . చుట్టూ పంచ పరమాన్నాలు ఉంటాయి . కాని నోట్లోకి పోవు . ఒక వేల బల వంతంగా తిన్నా , కడుపులో బెట్టం పెట్టినట్లు ఉంటుంది . జైళ్ళ చుట్టూ తిరగ వలసి రావచ్చు , కోర్టుల చుట్టూ తిరగ వలసి రావచ్చు . ప్రతి రోజూ అవే ఆలోచనలతో , మనస్సు పాడై అనారోగ్యాల పాలు కావచ్చు . పక్ష వాతం రావచ్చు . గుండె జబ్బులు రావచ్చు . ఆకస్మికంగా మరణించ వచ్చు .

No comments: