అంశం: వసంత పంచమి
శీర్షిక: *సరస్వతీ దేవి*ధవళ వస్త్ర ధారణి
చదువుల తల్లీ సత్య వాణీ
వీణాపాణి విజ్ఞాన దాయిని
పుస్తకముల హస్త భూషణీ
తెల్ల కలువల స్థిర నివాసిని
సకల శాస్త్ర జ్ఞాన స్వరూపిణీ
శిశిర ఋతువులో, మాఘ మాసంలో
గలగల రాలే ఆకుల చప్పుళ్లతో
వెన్నెలమ్మ చల్లని వెన్నెల కురిపించగా
వచ్చును వసంత పంచమి పర్వదినం
ఇదియే శ్రీ పంచమి,మదన పంచమని
మాఘ శుద్ద పంచమి వసంత పంచమి
చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం
పిల్లలకు పడతులకెంతో పర్వదినం
కళకళ లాడును శారదా దేవి గుడులు
సుమగంధాల ధూపదీప నైవేద్యాలతో
వసంత పంచమి నాడిక
వాగ్దేవికి జరుగును గొప్ప వేడుక
పిల్లలు పెద్దలు గుడులకు చేరునిక
పూజలు పునస్కారాలు చేస్తారచట
పిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తారచట
విద్యా బుద్దులు నేర్పు తల్లి
విద్యార్ధులు, కవులకు , సంగీత
నృత్య కళాకారులకు కల్పవల్లి
అనురాగ వల్లీ బ్రహ్మ సతి *సరస్వతీదేవి*
No comments:
Post a Comment