అంశం: స్నేహ గీతాలు
శీర్షిక: *మన స్నేహం మధురమురా*
పల్లవి:
మన స్నేహం మధురమురా...
మన స్నేహం వీడమురా...."2"
మరుపు రాని మన స్నేహము
కలకాలం నిలుచునురా.... "2" "మన"
చరణం:01
తరములెన్ని మారినా....
వరము మన స్నేహమురా...."2"
వయసు ఎంత పెరిగినా...
మనసు ఎదిగి పోవునురా...."2" "మన"
చరణం:02
చిన్న నాటి జ్ఞాపకాలు...
మరిచి పోము మనమురా..."2"
ఒకరికొకరి సహాయాలు....
ఎనలేనివి మనవిరా..... "2" "మన"
చరణం:03
ఎవరు ఎన్ని చెప్పినా....
విడిపోము మనమురా..."2"
ఎవరికి ఏ ఆపద వచ్చినా ...
ఒకరికొకరము తోడురా...."2" "మన"
No comments:
Post a Comment