Wednesday, August 6, 2025

గోముఖ వ్యాఘ్రాలు P

అంశం:విశ్వాస ద్రోహం

శీర్శిక: *గోముఖ వ్యాఘ్రాలు*

సృష్టిలో ఉత్కృష్టమైన జీవి మనిషి
మనిషి అనేవాడు ఒక సంఘజీవి
సంఘ జీవి సమాజంలోని తోటి మనుష్యుల
మనుష్యుల మనసులతో కలిసి జీవించాలి!

సమాజంలో జీవించే టప్పుడు
కొన్ని విలువలకు మాటలకు బాధ్యతలకు      సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి                         నీతిగా నిజాయితీగా ధర్మంగా నమ్మకంగా         నడుచు కోవాలి!

డబ్బు లేకపోయినా
కొంతకాలం ఆహారం లేక పోయినా
కొంత సమయం నీరు లేక పోయినా
ఎలాగో అలాగ జీవించ వచ్చు!

కానీ ఒక సారి విశ్వాసం కోల్పోతే
ఎదుటి వారిలో సమాజంలో
నమ్మకం కోల్పోతే గౌరవంగా బ్రతకడం
చాలా కష్టం!

ఇచ్చిన మాటకు నిలబడక పోయినా
చేస్తానన్న పని చేయక పోయినా
అసత్యాలు మాట్లాడినా చాడీలు చెప్పినా
విశ్వాసం కోల్పోయిన వారిగానే భావించాలి!

నమ్మకంగా ఉంటూ మోసం చేసినా
విశ్వాసంతో ఉంటూ వెన్నుపోటు పొడిచినా
ముందు పొగుడుతూ వెనుకాల తెగిడినా
విశ్వాస ద్రోహం మనే చెప్పాలి!

ఇస్త్రీ బట్టలతో పైకి ఉన్నతంగా కనబడుతూ
తిరిగే *గోముఖ వ్యాఘ్రాలు* సమాజంలో
అడుగడుగునా కనిపిస్తారు
గురువింద గింజ తన నలుపునెరుగదన్నట్లు
నమ్మక ద్రోహులు సమాజంలో తిరుగుతూ
తేలికగా డబ్బు సంపాదించాలనుకునే ఆశ
క్షణాలలో కోటీశ్వరులం కావాలనే దుర్బుద్ధి
కొందరికది వృత్తి మరియు ప్రవృత్తి అదియే!

కళ్ళు మూసుకొని పాలు త్రాగిన పిల్లిలా
తెలిసి మోసంచేసినా తెలియక వేషంవేసినా 
ఎవరు ఎలా చేసి తప్పించుకున్నా
విశ్వాస ఘాతకులు సమాజంలో
గౌరవం గుర్తింపు పొంద లేరు
కర్మ నుండి శిక్షను తప్పించు కోలేరు
అది రేపే కావచ్చు జీవిత కాలంలో కావచ్చు
మరణించాక కావచ్చు
తాను కావచ్చు లేదా తన తరాలు కావచ్చు 
శిక్షలు అనుభవించాల్సి రావచ్చు
 

No comments: