శీర్షిక: *ఎన్నికల సంస్కరణలు జరుగాలి*
తెల్ల దొరల నెదిరించి
గుండెను ఎదురు నిలిపి పోరాడే
నాడే వీర నారి ఝాన్సీ మన్యం దొర అల్లూరి
టంగుటూరి సర్ధార్ వల్లభాయ్ పటేల్
అహింసా వాదంతో సంఘటిత శక్తితో
సాధించే స్వాతంత్ర్యం గాంధీజీ మరెందరో
మచ్చుకైన కానరావు నాటి పోకడలు
దోచుకుంటూ పోతుండే దోపిడి దారులు
స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాభ్ధాలైనా
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు
ధనికులు కుబేరులు కాగా పేదలు నిరుపేదలైరి!
ఎన్నికల సంస్కరణలు జరుగకుంటే
సంపద వికేంద్రీకరణ జరుగనట్లైతే
వేయి ఏండ్లైనా బడుగులు బ్రతకడం దుర్లభం
భావి తరాలకు మనుగడ కష్టతరం!
నేరస్తులు, అవినీతి పరులు
రంగులు మార్చే ఊసరవెల్లులకు
ఎనబైయేండ్ల నేతలకు అదుపు ఏది?
ఎన్నికల ఖర్చుపై నియంత్రణ ఏది?
నేతల జీతాల పెంపుకొక నియమం ఉందా?
ఐదేండ్ల సేవలకు శ్వాసాడేదాకా పెన్సనా?
రాజకీయ నాయకులేమైనా కార్మికులా ?
పదవికొక పెన్సన్ నేతలేమైనా దేవదూతలా?
జీతాలకు పెన్సన్లకు పన్నులు ఏవి?
అఫిడవిట్లకు వాస్తవ ఆస్తులకు పొంతనేది?
బినామి చట్టాల ఆమలు ఏది?
చట్టాలు ధనికుల చుట్టాలు కాకూడదు
అసమర్ధ నేతలను, అవినీతి నాయకులను
వెనుకకు పిలిచే హక్కు ఓటర్లకుండాలి
ఎన్నికల హామీలను అమలు చేయక కపోతే
అది మోసపూరిత నేరమవ్వాలి
మార్పు కొరకే ఈ తపన
అసమానతలు తొలగాలని ఆవేదన
వెలుగు నిండాలి జగతిన
దేశం సాగి పోవాలి ప్రగతి బాటన!
నేరస్తులు, అవినీతి పరులు
రంగులు మార్చే ఊసరవెల్లులకు
ఎనబైయేండ్ల నేతలకు అదుపు ఏది?
ఎన్నికల ఖర్చుపై నియంత్రణ ఏది?
నేతల జీతాల పెంపుకొక నియమం ఉందా?
ఐదేండ్ల సేవలకు శ్వాసాడేదాకా పెన్సనా?
రాజకీయ నాయకులేమైనా కార్మికులా ?
పదవికొక పెన్సన్ నేతలేమైనా దేవదూతలా?
జీతాలకు పెన్సన్లకు పన్నులు ఏవి?
అఫిడవిట్లకు వాస్తవ ఆస్తులకు పొంతనేది?
బినామి చట్టాల ఆమలు ఏది?
చట్టాలు ధనికుల చుట్టాలు కాకూడదు
అసమర్ధ నేతలను, అవినీతి నాయకులను
వెనుకకు పిలిచే హక్కు ఓటర్లకుండాలి
ఎన్నికల హామీలను అమలు చేయక కపోతే
అది మోసపూరిత నేరమవ్వాలి
మార్పు కొరకే ఈ తపన
అసమానతలు తొలగాలని ఆవేదన
వెలుగు నిండాలి జగతిన
దేశం సాగి పోవాలి ప్రగతి బాటన!
No comments:
Post a Comment