అంశం: రక్షాబంధన్ గీతాలు
శీర్షిక: అన్నా....ఓ అన్నా.....
పల్లవి:
అన్నా.... అన్నా.... ఓ అన్నా ....
అన్నవైనా...తమ్ముడైనా మీరే నన్నా..."2"
అమ్మవైనా నాన్నవైనా మీరే కదన్నా....
మా పాలిట దైవాలు మీరే నన్నా.... "2" "అన్నా"
చరణం:01
ఒకే కడుపులో పుట్టామూ....
ఒకే రక్తం పంచుకున్నామూ..."2"
ఒకే కంచంలో తిన్నామూ...
ఒకే మంచంలో పన్నామూ.... "2" "అన్నా"
చరణం:02
కొట్టుకున్నా తిట్టుకున్నా
మనసు లేమి పెట్టుకోలే ...."2"
ఎవరు గెలిచినా ఎవరు ఓడినా
ఈర్ష్య లేమీ లేవు మనకూ ...."2" "అన్నా"
చరణం:03
మధ్యన వచ్చిన బంధాలే
కలతలు పెంచు తుండెనా..."2"
ఆస్తులు అంతస్తులే
అహాలు పెంచు తుండెనా.... "2" "అన్నా"
చరణం:04
అన్నా చెల్లెళ్ళ బంధాలకు
హద్దు రాళ్ళే పాతిరా....."2"
రక్షాబంధన్ రోజు రాఖీ తెచ్చానన్నా....."2"
నీ ప్రేమ కోరి వచ్చానన్నా....
నీ ఆస్తులేమీ నాకు వద్దన్నా.... "2" "అన్నా"
No comments:
Post a Comment