అంశం: స్వతంత్రం - స్వేచ్ఛ
శీర్షిక: స్వేచ్ఛంటే ఇదేనా?
ఉరుములు మెరుపుల కాంతులు
ఆకాశంలో మబ్బుల దుప్పట్లు
బస్సుల రణగొణ ధ్వనుల రాగాలు
ఎవరి ఆలోచనలలో వారు ప్యాసెంజర్లు!
భారతీయ సంస్కృతికి సాంప్రదాయాలకు
వారు మచ్చ తెచ్చే ఖడ్గ మృగాలు
ఎడారులలో సంచరించే వికృత విష నాగులు!
ఆగమ సంచిత కర్మయో! ప్రారబ్ధ కర్మయో!
విధి వైపరీత్యమో! చట్టాలలో లొసుగులో!
కలియుగంలో మానవత్వం నశించె
మనిషిలో కౄరత్వం నిద్ర లేచే!
ఆ పసి బిడ్డకు అది ఒక కాళరాత్రాయే
ఎన్ని ఆశలతో బస్సులో జన్మించెనో
ఏమి సాధించను జగతికి వచ్చెనో
వెలకట్టలేని మానవ సంపద మట్టిపాలాయే!
అన్యం పుణ్యం ఎరుగని ఆ శిశువును
గుడ్డలో చుట్టి బస్సు కిటికీ నుండి
బయటకు విసిరేయ ఆ మృగానికి
చేతులెలా వచ్చెనో ఆ దుశ్శాసనుడికి
బస్సు అద్దం నుండి డ్రైవరు గమనించకుంటే
ప్రపంచానికి తెలిసేదేనా ఆ నికృష్టుల చేష్టలు
తెలియకుండా పోతున్నవి మరెన్నో!
బస్సునాపి ఏమిటా వస్తువని ప్రశ్నించగ
తడబడుతూ చెప్పే భార్య వాంతియని
అనుమానం తో ప్యాసెంజర్లతో వెతికి జూడ
బస్సులో ప్రసవించిన మృతజీవని తేలే!
మీరెవరిని అడుగగా , భార్యా భర్తల మనిరి
మరల గద్దించి అడుగగా సహజీవనమనిరి
మహారాష్ట్ర లోని పర్బానీ ప్రాంతంలో
సంత్ ప్రయాగ్ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ లో
పెత్రు- సెలూ రహదారిపై ప్రసవించె
యువతి రతిక దీరీ పెళ్లి కాకుండానే
విసిరి పారేసే పసి గుడ్డును ఆల్తాఫ్ షేక్!
స్వేచ్చ అంటే ఇదేనా సాధికారతంటే ఇదేనా
ఒకటిన్నర సంవత్సర కాలం పూణేలో
సహజీవన ఫలితమే రతిక దీరీకి గర్భం
డాక్టర్లనే ప్రశ్నించే ప్రసవం ఇంత సులువా అని
గాలిలో కలిసి పోయే పసిగుడ్డు నిండు ప్రాణం!
కఠిన శిక్షలు విధించాలి
మానవత్వం మరిచిన మానవ మృగాలకు
మరొక చోట జరుగకుండా చూడాలి
శిశు సంక్షేమ అధికారులు మేధావులు!
No comments:
Post a Comment