ప్ర . కుటుంబంలో ప్రశాంతత నెల కొనాలంటే ఏమి చేయాలి ?
జ . కుటుంబంలోని సభ్యులంతా సఖ్యంగా, ఐఖ్యంగా, క్రమ శిక్షణతో ఉంటూ , ఇగోలకు పోకుండా , ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకుంటూ , కుటుంభాన్ని పోషించే ( ఆడ కావచ్చు , మగ కావచ్చు లేదా ఇద్దరూ కావచ్చు ) , వారికి అనుకూలంగా నడుచుకుంటూ ఉంటే , కుటుంబంలో ప్రశాంత నెలకొంటుంది . మనసు ఉల్లాసంగా ఉంటుంది . కుటుంబంలో గొడవలు , ఘర్శనలుండవు . అప్పుడు చెట్టు క్రిందనైనా , పుట్ట క్రింద నైనా , పూరి గుడిసె లోనైనా , పస్తులుండైనా , హాయిగా , సంతోషంగా జీవించ వచ్చు . అంతే కాని ఆడంభారాలకు పోయి , లేనిది కావాలని కోరుకుని , ప్రక్క వారి కున్నది మనకు లేదని , అక్రమ సంపాదనకు ప్లానులు వేసి , క్షణికమైన శారీరక సుఖాలకు తెర లేపి , కోట్లకు పడగలెత్తుదామన్న దురాశతో లేదా ఏదయినా సమస్య ఉత్పన్నమయినప్పుడు వాస్తు దోషాలని , మూఢ నమ్మకాలతో కుటుంభాన్ని పోషించే వారి ( ఆడ కావచ్చు , మగ కావచ్చు లేదా ఇద్దరూ కావచ్చు ) , యిష్టానికి విరుద్దంగా , ఏక పక్షంగా ఇంట్లో వస్తువులు , ఫోటోలు , అద్దాలు , టీ . వీ. ల స్థలాలు మార్చడం వలన , చని పోయిన పెద్దల ఫోటోలు తీసి వేయడం వలన , ఇండ్లు , జాగలు ఆమ్మటాలు , పునర్నిర్మాణాలు చేయడం వలన , కొత్త కొత్త వేషాలు వేయడం వలన , అరిచి డామినేషన్ చూపించు కోవాలనుకున్నా ప్రశాంత నెలకొనదు గాక , పైనుండి మన:స్పర్ధలు పెరిగి , ఘర్శనలు పెరిగి పోవచ్చు . ఒకరి కొకరు ఎకాకయి ఏవైనా అనుకోని నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు . ఏదైనా కల్సి నిర్ణయాలు తీసుకోవాలి . లేదంటే వదిలేయాలి . ఇంటిని పోషించే వారి మీద ఆడార పడి జీవించే వారు , తాబట్టిన కుందేలుకు మూడే కాళ్ళని గాలిలో మేడలు కట్టాలని వ్యవహరిస్తే , కుటుంబం మొత్తం మరియు వారిపై ఆదారపడిన కుటుంబాలు కుమిలి కుమిలి జీవించ వలసి రావచ్చు . ఆర్ధికంగా నష్ట పోవాల్సి రావచ్చు . కుటుంబ గౌరవం పోవచ్చు . అంతే కాదు , వీరి ప్రభావం మొత్తం సమాజంపై పడుతుంది . లా & ఆర్డర్ కు పని కల్పించాల్సి రావచ్చు . కోర్టుల కేసులు తప్పక పోవచ్చు
No comments:
Post a Comment