Friday, March 11, 2016

STATES & COUNTRY LAND SURVEY IS MUST TO CONTROL CORRUPTION / తెలంగాణాలోని భూములన్నింటిని , ఆ తరువాత దేశం లోని భూములన్నింటిని సమగ్ర సర్వే చేయించాలి ?

ప్ర . తెలంగాణాలోని భూములన్నింటిని , ఆ తరువాత  దేశం లోని భూములన్నింటిని   సమగ్ర సర్వే ( LAND SURVEY) చేయించాలి ?

జ . " సమగ్ర  సామజిక , ఆర్ధిక  సర్వే "  జరిగిన  తరువాత , కనీసం  3 నెలలు  సమయం ఇచ్చి ,  రెవెన్యూ అధికారులతో , మరియు రెవెన్యూ  సిబ్బందితో , తెలంగాణా భూముల ను  సమగ్ర సర్వే ( LAND SURVEY) చేయించాలి . 3 నెలల సమయం ఎందుకంటే , ప్రతి ఒక్కరూ  వారి వారి  భూములను  ఖచ్చితంగా  రిజిస్టర్  చేయించు కోవాలి .  ఏ  ఒక్క  భూమి  కూడా  రిజిస్ట్రేషన్  కాకుండా  ఉండ కూడదు . అయితే  ఇప్పటికిప్పుడు  ప్రజల వద్ద  డబ్బు ఉండక  పోవచ్చు  . అందుకని  ప్రజలకు  పూర్తీ  భారం పడ కుండా , 50%  రిజిస్ట్రేషన్  చార్జీలను  ప్రభుత్వమే భరించాలి . అంతే  కాకుండా, రిజిస్ట్రేషన్  విధానాన్ని సులభతరం  చేయాలి . మధ్యవర్తులను , బ్రోకర్లను   వ్యవస్థను  నిషేదించాలి. రిజిస్ట్రేషన్  డాక్యుమెంట్స్ ఫార్మాట్స్  ను  రెడీమేడ్  గా  ప్రింటు చేసి  ఉంచాలి . అనవసరమైనా  డాక్యుమెంట్స్ ను  ఎత్తివేయాలి . డాక్యుమెంట్స్  పది  కాలాలు జీవించాలి   కాబట్టి , ఎక్జిక్యూటివ్  బాండు  పేపర్లను  మాత్రమె  వాడాలి .  మరియు  రిజిస్ట్రేషన్ కు  సంభందించిన  నాన్  జుడిష్యల్  బాండు  పేపర్లను  అందుబాటులో  ఉంచాలి . ఆల్టర్ నేటివ్ గా , ఫ్రాన్కింగ్  మెషన్  ను అందు బాటులో ఉంచాలి .  ప్రజలకు  అనుకూలంగా  రిజిస్త్రార్  ఆఫీస్  సమయాలు  పెంచాలి .  భూముల వివరాలను  తెలుసుకునేందుకు , మార్కెట్  విలువలను  తెలుసుకునేందుకు , ప్రజలకు  అందు బాటులో , రిజిస్త్రార్ ఆఫీసు లోనే  ఇంటర్నెట్ తో కూడిన  కంప్యుటర్ ను  ప్రతి  రిజిస్త్రార్  ఆఫీసు లో  నెలకొల్పాలి .  సూచనలకు , సలహాలకు , కామ్ప్లేన్ట్స్  కొరకు  ఒక  బాక్ష్  ను ఏర్పాటు చేయాలి . రిజిస్త్రార్  ఆఫీసులో  తగినంత  సిబ్బందిని , మౌలిక  సదుపాయాలను ఏర్పాటు చేయాలి .

" తెలంగాణా  భూముల  సమగ్ర  సర్వే "  వలన  అనేక  విషయాలు  వెలుగులోకి  వస్తాయి . అవి ,

1. ప్రభుత్వ భూములు  ఎన్నో , ప్రజల భూములు  ఎన్నో , దేవాదాయ భూములెన్నో, శికం భూములు ఎన్నో  , బినామి భూములు ఏవో   తెలుస్తుంది .

2. ఆక్ర మించిన  భూములెన్నో , అడ్డంగా దోచిన భూములెన్నో తెలుస్తుంది .

3. నల్ల ధన భూములెన్నో , బినామి  భూములెన్నో తెలుస్తుంది .

4. నిజాయితీగా  కొన్న భూములెన్నో , వాటికి  సంభందించి  ఎంత  ప్రాపర్టీ  టాక్ష్  బకాయి  పడ్డారో , ఎంత  సంపద పన్ను  బకాయి పడ్డారో  తెలుస్తుంది .

5. ఇండ్ల  కిరాయిల  ద్వారా  ఎంత  ఆదాయం  సంపాదిస్తున్నారో  , ఎంత  టి డి ఎస్  ( ఆదాయ పన్ను ) ఎగ్గోడుతున్నారో  తెలుస్తుంది .

6. పేదలకు పంచ డానికి , భూములు  అందు బాటులోకి  వస్తాయి .

7. పరిశ్రమలు  పెట్ట డానికి , పారిశ్రామిక వేత్తలకు  భూములు  అందు బాటులోకి  వస్తాయి .

8. రోడ్లను , పట్టణాలను  విస్తరించ డానికి  అవకాశం  చిక్కుతుంది .      

9.  ప్రభుత్వానికి  వేల కోట్ల ఆదాయం వన గూరుతుంది .

10. కబ్జా దారుల  భూముల్ ను  ప్రభుత్వం  స్వాధీనం చేసు కోవడమే కాకుండా , శిక్షల ను  కూడా  పరిగణలోకి తీసుకుంటారు  కాబట్టి ,  ప్రజలలో  మరో సారి  అవినీతికి  పాల్పడ కుండా  భయం  ఏర్పడుతుంది .

11. సామాన్య  మరియు మధ్య తరగతి  ప్రజలకు , ప్రభుత్వం పై  విశ్వాసం  ఏర్పడుతుంది .

12. నీతి పరులకు , నిజాయతీ  పరులకు  ఆత్మ విశ్వాసం  పెరుగుతుంది . వ్యవస్థ పై  నిరాశ తగ్గు తుంది . ఆ కారణంగా  ధర్మ బద్ధంగా  బ్రతక డానికి ప్రయత్నిస్తారు . దీని వలన  రాష్ట్రంలో  వివాదాలు తగ్గుతాయి . లా & ఆర్డర్  సవ్యంగా  ఉంటుంది .

13. కులాలను , మతాలను , రిజర్వేషన్లను , అధికారాలను , రాజకీయ  పలుకుబడిని  అడ్డం పెట్టుకుని అధికంగా  , అక్రమంగా    సంపాదించిన  ఆస్తులుంటే  పసిగట్ట వచ్చు .అందుకని , ఇన్ని ఉపయోగాలు , లాభాలు  ఉన్నటువంటి  " తెలంగాణా  భూముల  సమగ్ర  సర్వే "  ను  తప్పక  జరిపించాలి .ఆ  తరువాత  ఇలాంటి  సమగ్ర సర్వేను  దేశ వ్యాప్తంగా  విస్తరింప చేయాలి .


No comments: