ప్ర . డబ్బు ( MONEY) బాగా సంపాదించిన కోటీశ్వరులను , ఎప్పుడూ కోటీశ్వరులే అంటారా ?
జ . డబ్బు సక్రమంగా సంపాదించినా , అక్రమంగా సంపాదించినా వారిని బాగా డబ్బున్న వారు , మంచి ఆస్తి పరులు అని అంటారు . ఇక వారు డబ్బు సంపాదించ లేక పోతే పేద వారు అని , కొంత డబ్బు సంపాదిస్తే మధ్య తరగతి వారని , లక్షల్లో సంపాదిస్తే వారిని లక్షాధి కారు లని , కోట్లల్లో సంపాదిస్తే వారిని కోటీశ్వరులని , బిలియన్లో సంపాదిస్తే వారిని బిలియనీర్లని అంటారు .
ఎంత డబ్బు సంపాదించినా , అది అక్రమంగా సంపాదించినా , సక్రమంగా సంపాదించిన , బిక్ష మెత్తి సంపాదించినా , ఎల్లా వేళలా లక్షాధి కారు లని గానీ , కోటీశ్వరులని గానీ , బిలియనీర్లని గానీ పిలువ బడరు . కేవలం వారు ఆరోగ్యంగా ఉన్నంత కాలం , వారు ఆ డబ్బును అనుభవిస్తున్నంత కాలం , దాన ధర్మాలు చేస్తున్నంత కాలం మాత్రమే అలా పిలువ బడుతారు . మిగిలిన సమయాలలో వారిని , వారి జీవన విధానాన్ని బట్టి , వృత్తిని బట్టి , సీవలను బట్టీ పిలువ బడుతారు.
ఉదా :01. అదే కోటీశ్వరుడు హస్పటలో ఉంటే , అతనిని పలానా పేషంట్ అని అంటారు గాని , పలానా కోటీశ్వరుడు అని అనరు .
02. అదే కోటీశ్వరుడు జైల్లో ఉంటే , అతనిని పలానా ఖైదీ అని అంటారు గాని , పలానా కోటీశ్వరుడు అని అనరు.
03. అదే కోటీశ్వరుడు కోట్లు ముంచి విదేశాలకు పారి పోతే , అతనిని పలానా మోస గాడు అని అంటారు గాని , పలానా కోటీశ్వరుడు అని అనరు .
04. అదే కోటీశ్వరుడు ప్రజలను హింసిస్తూ పాలిస్తుంటే , అతనిని పలానా నియంత అని అంటారు గాని , పలానా కోటీశ్వరుడు అని అనరు .
05. అదే కోటీశ్వరుడు హత్యలు చేస్తూ ఉంటే , అతనిని పలానా హంతకుడు అని అంటారు గాని , పలానా కోటీశ్వరుడు అని అనరు .
06. అదే కోటీశ్వరుడు దాన ధర్మాలు చేస్తూ ఉంటే , అతనిని పలానా దాన కర్ణుడు అని అంటారు గాని , పలానా కోటీశ్వరుడు అని అనరు .
07. అదే కోటీశ్వరుడు కోట్లో వాదిస్తూ ఉంటే , అతనిని పలానా వకీలు అని అంటారు గాని , పలానా కోటీశ్వరుడు అని అనరు .
08. అదే కోటీశ్వరుడు గుడిలో అర్చన చేస్తూ ఉంటే , అతనిని పలానా పూజారి అని అంటారు గాని , పలానా కోటీశ్వరుడు అని అనరు .
09. అదే కోటీశ్వరుడు తాను తినకుండా , ఇతరులను తిన నివ్వకుండా దాచి పెట్టు కుంటూ పోతూ ఉంటే , అతనిని పలానా లోభి లేదా పిసినారి అని అంటారు గాని , పలానా కోటీశ్వరుడు అని అనరు .
10. అదే కోటీశ్వరుడు వైద్యం చేస్తూ ఉంటే , అతనిని పలానా డాక్టర్ అని అంటారు గాని , పలానా కోటీశ్వరుడు అని అనరు .
10. అదే కోటీశ్వరుడు వైద్యం చేస్తూ ఉంటే , అతనిని పలానా డాక్టర్ అని అంటారు గాని , పలానా కోటీశ్వరుడు అని అనరు .
11. అదే కోటీశ్వరుడు వ్యాపారం చేస్తూ ఉంటే , అతనిని పలానా వ్యాపారి అని అంటారు గాని , పలానా కోటీశ్వరుడు అని అనరు .
12. అలానే పేద వాడు కోట్లో వాదిస్తూ ఉంటే , అతనిని పలానా గొప్ప వకీలు అని అంటారు గాని , పలానా పేద వాడు అని అనరు .
13. అలానే పేద వాడు వైద్యం చేస్తూ ఉంటే , అతనిని పలానా గొప్ప డాక్టర్ అని అంటారు గాని , పలానా పేద వాడు అని అనరు .
14. అలానే పేద వాడు ఎన్నికలలో గెలిచి ప్రజలను చక్కగా పరి పాలిస్తూ ఉంటే , అతనిని పలానా గొప్ప నాయకుడు అని అంటారు గాని , పలానా పేద వాడు అని అనరు .
15. అలానే పేద వాడు సినిమాలలో , టీ . వీ. లలో నటిస్తూ ఉంటే , అతనిని పలానా గొప్ప హీరో లేదా హీరోయిని అని అంటారు గాని , పలానా పేద వాడు/ పేద రాలు అని అనరు .
అందుకని , ఎవ్వరికైననూ , వారి చదువులను బట్టి , వారి వృత్తిని బట్టి , వారి సేవలను బట్టీ గుర్తింపు , పేరు ప్రతిష్టలు వస్తాయి , చిర స్థాయిగా నిలుస్తాయి గాని డబ్బుతో కాదు అని గుర్తించాలి .
No comments:
Post a Comment