ప్ర. అఫిడవిట్లు , నోటరీలు ఎంత వరకు ఉపయోగ కరం ?
జ. భారత దేశంలో , అతి ముఖ్యమైన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా , పోటీలో నిలిచిన అభ్యర్ధులు సబ్మిట్ చేసిన అఫిడవిట్లకు ఎన్నికల కమీషన్ , విలువను పెంచాలి.
అలానే సామాన్య పౌర సేవలకు ,అనగా ఇన్కం సర్టిఫికెట్స్ కు, బర్త్ సర్టిఫికెట్స్ కు , డెత్ సర్టిఫికెట్స్ కు, పెన్సన్ సర్టిఫికెట్స్ కు , అనేకరకాల అనుమతులకు , లైసెన్సులకు , అధికారులు అఫిడవిట్లను ప్రజల నుండి కోరు తుంటారు. దానికి తోడూ వాటిని నోటరీ చేయించ మంటారు . ఇవి ఎంత వరకు ఉపయోగ పడుతున్నాయో అధికారులు , ప్రభుత్వాలు ఆలోచించాలి. వీటి వలన ప్రజలకు సమయం వృధా అవుతుంది . రవాణా ఖర్చులు వృధా అవుతున్నాయి . డబ్బు వృధా అవుతుంది . బాండు పేపర్లు దొరుకక నకిలీవి తయారవు తున్నవి , మరి కొందరు అక్కడ తెచ్చాము , ఇక్కడ తెచ్చామని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు . పేపర్ల కొరకు చెట్లను నరుకుతున్నారు . అఫిడవిట్లను కాపాడ డానికి , సిబ్బందికి ఇబ్భందిగా మారింది . వీటి వలన కేవలం దళారులు , బ్రోకర్లు లబ్ధి పొందు తున్నారు . ప్రజలకు కష్టాలు , నష్టాలు మిగులుతున్నాయి.
అందుకని , అఫిడవిట్ల రద్దు గురించి అధికారులు ఆలోచించాలి. ప్రజలకు విముక్తి కలిగించాలి
No comments:
Post a Comment