Wednesday, March 16, 2016

HOW TO CONTROL TRAFFIC PROBLEM IN HYDERABAD & SECUNDERABAD ? / హైదరాబాద్ - సికింద్రాబాద్ లో " ట్రాఫిక్ సమస్య " లేకుండా చేయాలంటే ఎలా ?

ప్ర . హైదరాబాద్ - సికింద్రాబాద్ లో " ట్రాఫిక్ సమస్య " (TRAFFIC PROBLEM ) లేకుండా చేయాలంటే ఎలా ?

జ . గౌరవ ముఖ్య మంత్రి కె .సి .ఆర్. గారు తెలంగాణాను " బంగారు తెలంగాణాగా " మార్చాలన్న ఆశయం నేరవేరాలన్నా ," హైదరాబాదును విశ్వ నగరంగా" తీర్చి దిద్దాలన్నా ముందుగా హైదరాబాద్ - సికింద్రాబాద్  లోని  ట్రాఫిక్ సమస్యను అధిగ మించాలి

హైదరాబాద్ - సికింద్రాబాద్  లో  నేడు "ట్రాఫిక్ రద్దీ " అనేది ప్రతి ఒక్కరికి అత్యంత క్లిష్ట మైన సమస్య గా తయారయింది . రోడ్డు చూసినా వెహికిల్స్ తో కిక్కిరిసి పోతున్నాయి . సిటీలో ప్రయాణం దినం దినం ప్రాణ గండంలా మారి పోయింది. పది కిలోమీటర్లు ప్రయా ణించాల న్నా రెండు గంటలు పడుతుంది . విలువైన సమయం వృధా అవుతుంది . డిజిల్ , పెట్రోల్ కు అధికంగా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది . షార్ట్ కట్ అంటూ వెళ్తే జేబులు ఖాళి . దీనికి తోడూ ప్రమాదాలు చోటు చేసు కుంటున్నాయి. " ట్రాఫిక్ జామ్ " సమస్య ను అధిగ మించాలంటే కొన్ని సూచనలు , సలహాలు

1. ప్రభుత్వం మరియు సంబంధిత అది కారులు నిజాయితీగా నిస్పక్ష పాతంగా, పార దర్శకంగా నిభంధనలను అమలు చేయాలి . ఖర్చుకు వెనుకాడ కుండా , శాశ్వతమైన మరియు కొన్ని తరాల వరకూ మార్చ కుండే విధానాలను రూపొందించాలి

2. మెయిన్ రోడ్లను , ఇన్సైడ్ రోడ్లను విషయంలో లాలూచీ పడ కుండా విస్త రించాలి. అవసర మైతే ఆక్రమించి కట్టు కున్న కట్ట డాలను నిర్మూలించడమో , కొనడమో చేయాలి . రోడ్లపై ఎక్కడా గుంటలు పడ కుండా రెగ్యులర్ గా మేంటైన్ చేయాలి

3. పాద చారులకు ప్రత్యేకంగా ఫూట్ పాత్ లను నిర్మించాలి.

4. మెయిన్ రోడ్ల మీద , ఫూట్ ఫాత్ మీద , ఒక్క కూరగాయల బండి గాని , పండ్ల బండి గాని , టిఫిన్ సెంటర్స్ గాని , మరే ఇతర అమ్మకాల బండ్లు గాని లేకుండా , కార్లు , ఆటోలు , రిక్షాలు నిలువకుండా కఠిన మైన నిభందనలు విధించాలి . వారికి అందు బాటులో ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేయాలి

5. వి . . పి (VIP) లు వచ్చినప్పుడు సాధ్యమైనంత మేరకు , హెలీ కాఫ్టర్లను మాత్రమే ఉపయోగించాలి .

6. "ట్రాఫిక్ జాము" కు కారణం వర్షపు నీరు కూడా . వర్షం పడి నప్పుడు , వర్షపు నీరు సులువుగా వేల్లేటట్లు గా డ్రైనేజీ సిష్టం ను , మురుగు కాలువలను ఎప్పటికప్పుడు క్లీయర్ చేస్తూ ఉండాలి . రోడ్లపై నీరు నిలువకుండా తగు జాగ్రత్తలు తీసు కోవాలి . ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేదించాలి .

7. కాలనీ రోడ్ల మీద , మెయిన్ రోడ్ల మీద , ఎట్టి పరిస్థితులల లోను, 2 లేదా 3 గంటల కంటే ఎక్కువ సమయం టెంట్లు , పందిర్లు , మండపాలు వేసి రోడ్లను బ్లాక్ చేయ కుండా పెనాలిటీలు విధించాలి

8. రోడ్ల పై చెత్త , వేస్టు ఇసుక , మట్టి , వస్తువులు వేయకుండా పెనాలిటీలు విధించాలి .

9. ఇతర జిల్లాలకు వెళ్ళే ప్రైవేటు బస్సులను , ఆటోలను మెయిన్ రోడ్ల మీదనే ప్యాసెంజర్ల కొరకు చక్కర్లు కొట్టకుండా ఖటిన నిర్ణయాలు తీసుకోవాలి . ఆటోలకు , బస్సులకు దగ్గరలోనే ప్రత్యేక మైన స్టాండులను ఏర్పాటు చేయాలి.

10. సిటీలో హెవీ వెహికిల్స్ తిరుగ కుండా ఖటిన చర్యలు తీసు కోవాలి .

11. అవసరమైన చోట మరిన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జీలను నిర్మించాలి

12. బస్సులకు , బైకులకు రూట్స్ డైవర్షన్ చేయాలి .


13. పర్మిట్స్ లేని , నియంత్రణ లేని మరియు కాలం తీరిన వెహికిల్స్ ను రోడ్ల పై తిరుగ నీయ రాదు .

14. అక్కడక్కడ కార్లకు , ఆటోలకు , బైకుల కొరకు కనీస పార్కింగ్ చార్జీలతో , మల్టిపుల్ పార్కింగ్ బిల్డింగ్ లను నిర్మించాలి .

15. ప్రమాదాలు కూడా ట్రాఫిక్ సమస్యకు ఒక కారణమే . అందుకని , వెహికిల్స్ వేగాన్ని, డ్రింకింగ్ డ్రైవింగ్ ను మరియు చర వాణి తో డ్రైవింగ్ ను నియంత్రించాలి.

16. మెయిన్ రోడ్ల వెంబడి , కాలనీ రోడ్ల వెంబడీ అవసారాల కొరకు , ఎవ్వరు త్రవ్వకాలు చేపట్టినా , ముందుగా ప్రభుత్వ పర్మీషన్ తీసుకుని బ్లూ ప్రింటు తయారు చేసుకొని , పనులు మొదలు పెట్టాలి . అతి తక్కువ కాలంలో పనులను పూర్తీ చేయాలి . తరువాత వారే పూడ్చాలి . పనుల కాలం లో , వెహికిల్స్ ను ప్రత్యామ్నాయ రూట్లల్లో పంపించాలి .

17. స్కూళ్ళు , కాలేజీలు , ఆఫీసులు మెయిన్ రోడ్లకు దూరంగా ఉండేవిధంగా అనుమతులివ్వాలి .

18. అవకాశం ఉన్న చోట్ల ( 5 కిలోమీటర్లకు మించ కుండా ) "బస్ బే " లను కనీస సదు పాయాలతో నిర్మించాలి . షటిల్ బస్సుల ద్వారా ప్రయాణికులను అక్కడికి , రైల్వే స్టేషన్లకు , మెట్రో స్టేషన్లకు మరియు ఏర్పోర్టులకు చేర్పించాలి . అక్కడి నుండి ప్రయాణికులు దూర ప్రాంతాలకు సులువుగా వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయాలి. అప్పుడు బస్సుల్లో మరీ రష్ ఉండదు , ఖాళీ ఉండదు . జేబు దొంగల బెడద ఉండదు . ప్రయాణికులు కూడా , ఆటో , బైకుల కంటే , బస్సు , ట్రేన్లల్లో ప్రయాణమే మేలు అనుకుంటారు . విధంగా రోడ్లపై పాసెంజర్ వెహికిల్స్ ను తగ్గించ వచ్చు .

19. బస్సుల చార్జీలు క్రమ బద్దీక రించాలి ( తగ్గించాలి ) . బస్సుల్లో , ట్రే న్లల్లో - సేఫ్టీ , సెక్యురిటీ , పరిశుభ్రత మరియు కనీస వసతులు పెంచాలి . విధంగా చేస్తూ కార్లల్లో , ఆటోల్లో , బైకులపై వెళ్ళే ప్రయాణికులను ఆకట్టు కోవాలి . విధంగా చేయడం వలన , ప్రభుత్వ (ఆర్ టి సి / రైల్వే ) ఆదాయం పెంచు కోవచ్చు , ప్రయాణికులకు ప్రమాదాలు , శ్రమ మరియు పెట్రోల్ భారాన్ని తగ్గించ వచ్చు. సమయం ఆదా చేయ వచ్చు . మరో వైపు కార్లు ,ఆటోలు మరియు బైకులు రోడ్ల మీద తగ్గి పోవడం వలన " ట్రాఫిక్ సమస్యను " అరి కట్టవచ్చు .

20. కొన్ని ప్రైవేటు కంపనీలు కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు, వారి వారి అవసరాల కోసం , రోడ్ల ప్రక్కన కేబుల్స్ వేయ డానికో , పైప్ లైన్స్ వేయ డానికో, డ్రైనేజ్ కొరకో గోతులు తీసి వెంటనే పూడ్చ కుండా తాత్సారం చేస్తుంటారు . కారణంగా తరుచూ ప్రమాదాలు జరిగి , ట్రాఫిక్ జామ్ జర్గు తుంటాయి. అందుకని ఇలాంటి పొరపాట్లు జరుగ కుండా తగిన చర్యలు చేపట్టాలి .

21. రాత్రి సమయాల్లో మెయిన్ రోడ్ల వెంబడి మరియు స్ట్రీట్ లైట్స్ సరీగా లేక పోవడం వలన , తరుచూ ప్రమాదాలు జరిగి , ట్రాఫిక్ జామ్ జర్గు తుంటాయి. అందుకని మెయిన్ రోడ్ల వెంబడి మరియు స్ట్రీట్ లైట్స్ , సోలార్ లైటింగ్ సిస్టం ద్వారా గాని , మరేదైనా లైటింగ్ సిస్టం ద్వారా గాని వెలుగులు విరజిమ్మే విధంగా ఏర్పాటు చేయాలి .

22. ట్రాఫిక్ జాములు కాకుండా , స్కూళ్ళు, కాలేజీలు , సినీమాల సమయాలను , పరిస్టితులను బట్టి మార్చాలి ,

23. ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రైవేటు బస్సుల కొరకు , ప్రత్యేకమైన "బస్సు బే " లను నిర్మించాలి . అవి ఇప్పుడు రోడ్ల వెంబడి , బస్సు స్టాపుల్లో గంటలకు గంటలు ఆగి ఉండటం వలన , ట్రాఫిక్ కు చాలా అంతరాయం ఏర్పడుతుంది .

24. రాత్రి సమయాల్లో , ప్రమాదాలకు అవకాశాముండే మరియు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే బైక్స్ , కార్ డ్రైవింగ్స్ పోతి నిషేదించాలి .

25. ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పై , ట్రాఫిక్ సమస్యలపై విస్తృతంగా మరియు నిరంత రాయంగా అవగాహన కల్పిస్తూ ఉండాలి .

26. ట్రాఫిక్ సమస్యలపై ప్రజల ఆలోచనలను , సూచనలను , సలహాలను మరియు వారి వినూతన మైన ఐడియాలను పరిగణలోకి తీసు కోవాలి .

27. అప్పటికీ " ట్రాఫిక్ జామ్ " కంట్రోల్ కానట్లయితే , పరిపాలనా విధానాన్ని వికేంద్రీక రించాలి . అంటే ఎక్కడి ప్రాంతపు వారు అక్కడే ప్రభుత్వ తరహ పనులు పూర్తీ చేసుకునే విధంగా , ప్రభుత్వ ఆఫీసులను నిర్మించాలి . కాలనీల విస్తీర్ణం పెంచాలి .



No comments: