ప్ర . అధిక విలువ గల నోట్ల రద్దు వలన ,' అవినీతి 'తగ్గుతుందా?
జ . అధిక విలువ గల నోట్ల రద్దు వలన , ' అవినీతి 'తగ్గదు:
అధిక విలువ గల రూ .లు .1,000/-,500/-,100/- నోట్లను రద్దు చేయడం వలన అవినీతి తగ్గదు . అది వట్టి భ్రమ .
అధిక విలువ గల రూ .లు .1,000/-,500/-,100/- నోట్లను రద్దు చేయడం వలన అనుత్పాదక సంపద తగ్గి , ఉత్పాదక సంపద పెరుగుతుంది . అలా ఉపయోగం లోకి వచ్చిన సంపద మూలంగా మౌలిక వసతులు మెరుగవుతాయి . ఉత్పత్తులు పెరుగు తాయి . నిరుద్యోగం తగ్గుతుంది . వస్తువుల ధరలు తగ్గు తాయి . ద్రవ్యోల్భణం తగ్గుతుంది . అంతే గాని అవినీతి తగ్గదు .
ఇక 'నల్ల ధనం ' గురించి చెప్పాలంటే , అధిక నోట్ల రద్దు వలన , స్వదేశంలో 'నల్ల ధనం' తగ్గుతుంది గాని , విదేశాలలో నల్ల ధనం తగ్గదు . మనం ఒకటి గుర్తుంచుకోవాలి .' స్విస్ ' బ్యాంకుల్లోకి నల్ల ధనాన్ని ,అధిక విలువ గల నోట్ల కట్టలు , ప్లాటినం , బంగారం , వెండి రూపంలో , భరత దేశం నుండి ఓడలలో , బస్సుల్లో , రైల్లల్లో , విమానాల్లో తరలించ లేదు కదా . కాని నేడు 'స్విస్స్ ' బ్యాంకుల్లో , సుమారుగా లక్షా 45 వేల కోట్ల 'నల్ల ధనం ' కేవలం భారత్ దే ఉందని అంచనా వేస్తున్నారు .
మరి అంత సొమ్ము ఎలా ప్రోగైంది 'స్విస్స్ ' బ్యాంకుల్లో ?
ఎల్ .పి జి .(L.P.G.) లాంటి స్వేచ్చా విధానాల ద్వారా , ఎఫ్ . డి . ఐ (F.D.I.) లాంటి వ్యాపారాల ద్వారా , ' నీకిది నాకది ' అనే ఒప్పందాల వలన మరియు బ్యాంకు ట్రాన్స్ఫర్స్
( బ్యాంక్ ట్రాన్ సాక్షాన్స్ ) ద్వారా మాత్రమే 'నల్ల ధనం ' ప్రోగైంది అనేది నగ్న సత్యం .
' అర్ధ క్రాంతి ' విధానం వలన , ప్రజల జీవితాలు పేనం , మీది నుండి పొయ్యిల్లో పడి మాడిన చందంలా తయారవుతుంది . 'బార్టర్ సిష్టం' ఉధృత మవుతుంది.
అందుకు కారణం , స్వాతంత్ర్యం వచ్చి 67 సంవత్సరాలైనా అధిక నిరక్ష రాస్యత , బ్యాంకులు ప్రజలకు అందుబాటులో లేక పోవడం , బ్యాంకులు ఇప్పటికే సర్వీస్ చార్జీలు , సర్వీస్ పన్నుల రూపేణా ఎడా పెడా వసూలు చేయడం, కోట్లాది ప్రజలకు బ్యాంకు అకౌంట్లు లేక పోవడం , అకౌంట్లు తెరువాలంటే , లక్షా తొంబై యక్ష ప్రశ్నలతో , వారాలకు వారాలు త్రిప్పడం , విపరీత మైన హాకర్ల బెడద , రాత్రికి రాత్రే , బ్యాంకుల్లో బ్యాలేన్సులు ఖండాంతరాలు దాటి పోవడం , హ్యాకింగ్ అయిన సోమ్ములకు బ్యాంకులు పట్టించు కోక పోవడం వలన , కోర్టులు కేసులకు ఆదేశాలివ్వడం మొదలైనవి .
వీటికి బదులు , 'అవినీతి ' 'నల్లధనం' తగ్గా లంటే
01. 'రాజ్యాంగ వ్యవస్థలు ' బలోపేతం కావాలి .
02. ఎన్నికల విధానంలో మార్పులు రావాలి .
03. 'ఓటు బ్యాంక్' సంక్షేమ పథకాలు విడనాడాలి .
04. ప్రభుత్వ విధానాల్లో , స్పష్టత , పార దర్శకత , సమర్ధత ఉండాలి .
05. ప్రజలలో సత్ప్రవర్తన కలిగించాలి .
06. అవినీతి పై , నల్ల ధనం పై ప్రజలకు అనాశక్తి కలిగించాలి .
07. పన్నుల విధానాన్ని సులభతరం చేయాలి .
08. నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలి . చేతి నిండా డబ్బు గల గల లాడాలి
09. నిరక్ష రాస్యత రూపు మాపాలి . ఆరోగ్య అవగాహన కల్పించాలి .
10. ఆర్ధిక నేరాలకు పాల్పడుతే , పల్లె పౌరుడి నుండి ప్రధాన మంత్రి వరకూ , ఒకే రకమైన శిక్షలుంటా యన్న భావనను , భయాన్ని కలిగించాలి .
11. న్యాయం అనేది భారత దేశంలో జీవించే ప్రతి ఒక్కరికి ( కుల , మత, ప్రాంత , హోదా తారతమ్యం లేకుండా ) , సమానంగా వర్తింప చేయాలి .
"యథా రాజా , తథా ప్రజా " అన్నట్లు , రాజులు ఎలావుంటే ప్రజలు అలానే నడుచుకుంటారు . అందు కని, పాలకులు మారుతే ప్రజలు మారుతారు . ప్రజలు మారుతేనే ప్రభుత్వాలు మారుతాయి . ప్రభుత్వాలు మారుతేనే దేశం అభివృద్ధి చెందుతుంది .
No comments:
Post a Comment