ప్ర . మనుష్యులను నేరస్తులుగా (CRIME) ఎవరు మారుస్తున్నారు ?
జ. సాధారణంగా ప్రతి శిషువు ఒకే క్రమ పద్దతిలో జన్మిస్తారు . కృత్రిమంగా ఎవరినీ సృష్టించడం లేదు . కాక పోతే వారి వారి బరువులలో , రంగులలో , ఎత్తులలో , ఆరోగ్యాలలో , ఆకృతులలో తేడాలుండ వచ్చు . కాని నేరస్తులుగా (CRIME) మొఖాన వ్రాసుకుని ఎవరూ జన్మించరు . ఒక అవినీతి పరుని బిడ్డను " అవినీతి పరుడు " అని అనగలమా ? ఒక కుంభ కోణం దారుడి బిడ్డను " కుంభ కోనుడు " అని అణా గలమా ? ( అలానే బంగారు చేమ్చానో లేదా ఇనుప చేమ్చానో నోట్లో పెట్టుకుని ఎవరూ జన్మించరు ) ఒక వ్యక్తి ఏవో కారణాలతో , ఎన్నో ప్రయత్నాలతో , వ్యయ ప్రయాసలకు ఓర్చి , తన అవసరాలకో , తన కుటుంభ అవసరాలకో , కూడ బెట్టుకోడానికో , ఒక పొరపాటు చేసి నేరస్తుడుగా పట్టుబడుతే , వ్యవస్థలు ఆ ఒక్కడిని చూపిస్తూ , అతడు లేదా ఆమె చేసిన నేరాన్ని కళ్ళకు కట్టినట్లుగా ప్రజలకు చూపిస్తూ , అతడు లేదా ఆమె చేసిన నేరాన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా , పూసా గ్రుచ్చి నట్లుగా , అరటి ఆకుకు తేనె రాసి నట్లుగా వివరిస్తూ , రేడియోలలో , టి . వి . లలో ప్రసారం చేస్తూ , పత్రికలలో ప్రచురిస్తూ , యూ ట్యూబ్ ల లోకి ఎక్కిస్తూ , ప్రతి నిమిషానికి లక్షలాది మంది కి ( ఏ విద్యా లేని వారికి కూడా అర్ధమయ్యే విధంగా ) ఉచిత ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా తెలియ జేస్తూ , వేలాది మందిని నేరస్తులుగా తయారు చేస్తున్నారు . నేరాలు ఉదా : సిమ్ కార్డులు కావచ్చు , చిట్టీలు కావచ్చు , ఎ . టి .ఎమ్ ల లూటీ కావచ్చు , డెబిట్ , క్రెడిట్ కార్డుల దొంగ తనం కావచ్చు , ఆన్ లైన్ మోసాలు కావచ్చు , దొంగ సెల్ ల వినియోగం కావచ్చు , దొంగ నోట్ల చెలామణి కావచ్చు, దొంగ సర్టిఫికెట్లను తయారు చేయడం కావచ్చు , మరేదైనా కావచ్చు . ఇలా తెలియ చేస్తే ఇక నేరాలకు అంతం ఎక్కడ ? ఇలా చేస్తే వ్యవస్థలకు పని భారం తప్పదు . వ్యయ ప్రయాసలు తప్పవు , లక్షల్లో , కోట్లల్లో డబ్బు వృధా కాక తప్పదు . అలా కాకుండా , సూక్ష్మంగా " సాంకేతిక విజ్ఞ్యానాన్ని వినియోగించుకుని " ఈ నేరాన్ని చేశాడు లేదా చేసింది . అంటే సరిపోతుంది . న్యాయ స్థానాలకు పూర్తీ వివరాలు సీల్డ్ కవర్లో ఇచ్చే విధంగా మార్పులు చేస్తే బాగుంటుంది . అప్పుడే నేరాలు తగ్గు మొఖం పడుతాయి. దేశం లోని అన్ని వ్యవస్థల అది కారులు , మేధావులు , సామాజిక వేత్తలు , సంఘ సంస్కర్తలు , రాజ కీయ నాయకులు , ఈ దిశ గా ఆలోచనలు చేస్తే ఎంతో మార్పు కనపడ వచ్చు .
No comments:
Post a Comment