ప్ర . కాలాన్ని (TIME) బట్టి మనుష్యులు ఎందుకు మారాలి ?
జ . జీవన చక్రం మొదలైన దగ్గరి నుండి , కాల గమనం మొదలైన దగ్గరి నుండి విగాదియలు , గడియలు , తిధులు ,నక్షత్రాలు , రోజులు , పక్షాలు , మాసాలు , రుతువులు , సంవత్సరాలు, యుగాలు మారుతున్నాయి . అందుకని ప్రతి ఒక్కరూ కాలాన్ని (TIME) బట్టి మారాలి . అది నిత్యం జరుగుతూనే ఉండాలి . అప్పుడే మార్పు అనేది ఏర్పడుతుంది . నిమిష నిమిషానికి అవసరాలు మారుతుంటాయి . కోరికలు మారుతుంటాయి . ప్రాధాన్యాలు
మారు తుంటాయి . ఆ కారణంగానే , నాటి అనాగరికత జీవన విధానం నుండి , నేడు నాగరిక జీవనానికి పరిణామం చెందింది . చెందుతునే ఉంటుంది . పల్లె జీవితాల నుండి మనుష్యులకు , పాశ్చాత్య పోకడలు అలవడు తున్నాయి . పరుగెత్తే ప్రవాహాన్ని ఆపడం ఎంత కష్టమో , పరుగెత్తే కాలాన్ని ఆపడం ఎంత కష్టమో , నేడు ప్రజల జీవన విధానాన్ని కూడా ఆపడం అంతే కష్టం . కాలానికి అనుగుణంగా మారక పోతే మనుష్యులలో కోరికలు ఉండవు . సంపాదించాలనే , సాధించాలనే ఆసక్తి ఉండదు . మనుషుల్లో చురుకు దనం ఉండదు . అలానే మనుష్యులలో అభివృద్ధి ఉండదు . అలానే దేశం లో అభివృద్ధి ఉండదు .

No comments:
Post a Comment