ప్ర . "'అంటల్యా ' (టర్కీ ) లో జరిగిన శిఖరాగ్ర సమా వేశంలో జరిగిన ముఖ్య నిర్ణయాలు ఏమిటి?
జ . " అంటల్యా ' (టర్కీ ) లో జరిగిన శిఖరాగ్ర సమా వేశంలో జరిగిన ముఖ్య నిర్ణయాలు- అవినీతిని అంతం చేయడం ".
ది. 15.11.2015 (ఆది వారం ) నుండి ది . 16.11.2105 ( సోమ వారం ) వరకు రెండు రోజులు 'అంటల్యా ' లో జరిగిన శిఖరాగ్ర సమా వేశం లో మన దేశ నేత మోడీ గారితో సహా జి - 20 దేశాల , దేశాది నేతలు పాల్గొని అనేక ముఖ్యమైన తీర్మానాలు చేశారు .వాటిలో ముఖ్య మైనది , సామాన్య ప్రజానీకానికి సంభందించినది , కావలసినది , అదే " అవినీతిని " అంతం చేయాలనే నిర్ణయం . " అవి నీతి " అనే భూతాన్ని కూకటి వ్రేళ్ళతో తరిమి కొట్టాలనే నిర్ణయం . నిజంగా ఈ నిర్ణయాలే గనుక అమలవుతే , సఫల మవుతే , ప్రపంచం లోని కోట్లాది మంది పేద ప్రజలకు మేలు చే కూరుతుంది అనుటలో సందేహం లేదు . ఇది ప్రపంచం లోని పేద ప్రజల ఆర్ధిక అసమానతలను తగ్గించి , ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి . అలానే ప్రతి ఒక్కరూ నిజాయితీగా , తలెత్తుకుని జీవించే విధంగా వ్యవస్థ తయారవుతుంది . నల్ల ధనానికి ఎలాంటి ఆస్కార ముండదు .
అయితే కేవలం నిర్ణయాల తోనే సరి పోదు . మనఃస్సాక్షిగా అమలు పరుస్తేనే , అదియును అతి తక్కువ సమయంలో అమలు పరుస్తేనే , సామాన్య , పేద ప్రజలకు న్యాయం చేకూర్చి నట్లవుతుంది . జీవన ప్రమాణాలను మెరుగు పరిచి నట్లవు తుంది . ఇది సాధించాలంటే ప్రపంచం లోని మద్య తరగతి , సామాన్య , పేద ప్రజల సూచనలను , సలహాలను , ఆలోచనలను పరిగణ లోకి తీసు కోవాలి . (ధన వంతుల , నల్ల కుభేరుల , కుంభ కోన దారుల సలహాలు , సూచనలు తీసుకో రాదు ).
01. మొదట , ' అవి నీతి ' ని తరిమి కొట్టడానికి ఆయా దేశాల చట్టాల కనుగుణంగా , గ్రాస్ లెవల్లో ' సిస్టంలను ' డెవలప్ చేయాలి . వాటిని పాటించాలి . వాటిని అమలు చేయాలి .
02. ముఖ్యమైన నేతలు , వ్యాపార వేత్తలు , అధికారులు వారి వారి అన్ని రకాల ఆస్తులను , అప్పులను బహిరంగ పరుచాలి . ఆదాయానికి మించిన ఆస్తులను ప్రభుత్వం వెంటనే జప్తు చేయాలి . అందరికి ఆదర్శంగా ఉండాలి . లేదంటే , నిర్ణయాలు తీసుకుని సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇచ్చి నట్లవు తుంది . అది భవిష్యత్తులో మరింత ప్రమాద కారి కాగలదు .
03. ఎన్నికలకు సంభందించి , ఏ వ్యాపార వేత్త వద్ద , నాయకులు ఎన్నికల చందా కని డబ్బు తీసు కోము అని మెంబర్లు అందరూ , పార్ల మెంటులలో , శాశన సభలలో తక్షణమే ప్రతిన పూనాలి .
04. నిజాయితీ పరులైన అధికారులను గుర్తించాలి , గౌరవించాలి , ఎంకరేజ్ చేయాలి . మరియు వారికి పూర్తి రక్షణ కల్పించాలి .
05. అవినీతికి పాల్పడ కుండా , అన్ని చట్టాలను సమర్ధంగా వినియోగించాలి .
06. పన్నులను నిస్వార్ధంగా విదించాలి . పన్నుల వ్యవస్థలు పార దర్శకంగా ఉండాలి . ఆదాయ పన్నులను ఆదాయాన్ని బట్టే కాకుండా , వారి ఖర్చులను బట్టి , వారి పొదుపు , పెట్టుబడులను బట్టి విధించాలి . పన్నుల వ్యవస్థను సులభతరం చేయాలి .
07. ఎన్నికల సమయాన ప్రకటించే మోస పూరిత వాగ్దానాలను , ఖచ్చితంగా నిషేదించాలి .
08. ఇప్పటి వరకు విదేశేలాలో మ్రగ్గు తున్న నల్ల ధనానికి సంభందించిన అన్ని అడ్డంకులను తొలగించి , ఆయా దేశాలకు పంపిచి వేయాలి . అలా వచ్చిన నల్ల ధనానాన్ని , ఆయా దేశాల 09. ప్రజల జీవన్ ప్రమాణాలు మెరుగు పరచడానికి ఉపయోగించాలి .
ఎన్నికలలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశాక , దేశ , రాష్ట్రాల ఆస్తుల కు , ప్రజలకు రక్షణగా ట్రస్టీగా ఉండాలి గాని , తమ స్వంత ఆస్తులుగా కబ్జా చేయకూడదు .
09. 190-91 నుండి ఇప్పటి వరకు జరిగిన స్విస్ బ్యాంక్ ల లావా దేవీలను బహిరంగ పరుచాలి . ఆ విధంగా బయల్పడిన నల్ల ధనాన్ని గుర్తించి , వెలికి తీయాలి .
10. మోస పూరిత ట్రస్టులను , మిషనరీలను , స్వచ్చంద సంస్థలను పూర్తిగా నిషేదించాలి . మిగిలిన వాటిలో సంపూర్ణమైన ఆడిట్ జరుగాలి .
11. అన్ని వ్యవస్థలు సక్రమంగా నడుచుకునే విధంగా నియంత్రణ ఉండాలంటే , న్యాయ వ్యవస్థలో , ఎన్నికల వ్యవస్థలో రాజకీయ జోక్యముండ కూడదు .
12. ఒక కుంభ కోణాన్ని ఒక సారి నియంత్రణ సంస్థలకు అటాచ్ చేసిన తరువాత , వారు అహో రాత్రులు కష్ట పడి వందల కోట్లు ప్రజా ధనం ఖర్చు పెట్టి , ఆ కుంభ కోణం యొక్క నిగ్గు తేలుస్తారు . అందుకని నియంత్రణ సంస్థలపై , న్యాయ వ్యవస్థలకు తప్పా , రాజకీయ నాయకులకు ఎలాంటి జోక్యం ఉండ కూడదు . రాజ కీయ జోక్యంతో , అధికారులను బదిలీ చేయ కూడదు .
13. ఆయా దేశాలలో , పారలల్ గా కొన సాగు తున్న నల్ల ధనాన్ని వెలికి తీసి , దేశాభి వృద్దికి సంభందించిన అన్ని రంగాలలో వినియోగించి , ప్రజల జీవన ప్రమాలను మెరుగు పరుచాలి .
14. అవినీతికి సంభందించిన కేసులను కేవలం 3 నెలల నుండి 12 నెలలో తేల్చి వేయాలి .కేసులను నాన్చుతే , సాక్షాలు తారు మారు అయి సమస్యలు మరింత జఠిల మవుతాయి .
15. దేశాల లోని అన్ని భూములను సర్వే చేయాలి . భూ హక్కు దారులు , తప్పని సరీగా వారి వారి పేర్ల మీద రిజిస్టర్ చేయించు కోవాలి . మిగిలిన భూములను ( ప్రభుత్వానివి మినహా ) బినామి భూములుగా గుర్తించి జాతీయం చేయాలి .
16. శిక్షలు అవినీతి పరులకు , నల్ల ధన కుబేరులకు , కుంభ కోన దారులకు , మోస పూరితులకు విధించాలి గాని , సామాన్యులకు , పేద ప్రజలకు విధించ కూడదు . వీరిలో కేవలం భయం , అవగాహన కల్పించాలి .
17. విదేశీ ప్రత్యక్ష పెట్టుడులలో నిజాయితీ , పార దర్శకత ఉండాలి . దేశీయ నల్లదనాన్ని , తెల్ల ధనంగా మార్చే ప్రయత్నాలను పూర్తిగా నిషేదించాలి .
18. లేదా పై సూచనలలో కనీసం ఒక్కటి పాటించినా , సామాన్య ప్రజలకు కొంత మేలైనా జరుగుతుందని ఆశిద్దాం .
No comments:
Post a Comment