ప్ర . పెండ్లిళ్ళ ఖర్చును ( MARRIAGE COST) 5 లక్షలకు నియంత్రించాలా ?
జ . పెండ్లిళ్ళ ఖర్చును (MUST CONTROL MARRIAGE COST) 5 లక్షలకు నియంత్రించాలనేది , కర్నాటక న్యాయ శాకా మంత్రి ' జయ చంద్ర ' గారి గొప్ప ఆలోచన . ఈ ప్రవేట్ బిల్లు తప్ప కుండా పాస్ కావాలి . అలానే దేశ మంతటికి విస్త రింప చేయాలి . పెండ్లిల్లో అనవసరమైన ఖర్చును నియంత్రిస్తే దుబారా తగ్గడమే కాదు , అవి నీతి ( CORRUPTION & BLACK MONEY) తగ్గు మొఖం పడుతుంది . మోసాలు తగ్గు తాయి . " తోటోడు తోడ కోసుకుంటే నేను మెడ కోసుకుంట " అన్నట్లు , మధ్య తరగతి , సామాన్య మరియు పేద ప్రజలు అప్పులు చేసైనా ఘనంగా పెళ్లి చేయాలి , పరువునిల బెట్టుకోవాలని , దొరిన కాడల్లా అప్పులు చేసి గొప్పలకు పోయి , అప్పులు తీర్చ లేక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు .
ఈ నియంత్రణ బిల్లును పాస్ చేస్తే , మధ్య తరగతి , సామాన్య మరియు పేద ప్రజల భయాందోనలు తగ్గు తాయి . వారి ఆలోచనల్లో మార్పు వస్తుంది . ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కారు . అప్పులు చేసి ఆత్మ హత్యలు చేసు కోరు . ప్రభుత్వ , ప్రైవేట్ దుబారా ఖర్చులను నియంత్రించ గలుగుతే , గ్రోత్ రేట్ పెరుగుతుంది . జి డి పి పెరుతుంది . ద్రవ్యోణం తగ్గుతుంది . డెఫిసిట్ తగ్గుతుంది . అనవసరమైన దిగుమతులు తగ్గడం వలన , విదేశీ నిధులు పెరుగు తాయి . కరెంట్ అకౌంట్ పాజిటివ్ గా ఉంటుంది . ఆదాయాన్ని బట్టే కాకుండా , ఖర్చును బట్టి ఆదాయ పన్ను , సంపద పన్ను చెల్లించాలనే దానికి దారి సుగమం అవుతుంది .
కోటి రూపాయలున్న ఆస్తి పరుడికి సంపదపై పన్ను లేదు . బినామి ఆస్తులకు పన్నులు లేవు , లాకర్లల్లో ఉన్న ఆస్తులకు పన్నులు లేవు . నల్ల ధనానికి పన్నులు లేవు . రాజ కీయ నాయకుల జీత భత్యాలకు పన్నులు లేవు , రాజకీయ చందాలకు లెక్కలు లేవు , పన్నులు లేవు , వ్యవ సాయ భూ స్వాములకు పన్నులు మినహాయింపు . ఇలా ఎందరికో , ఎన్ని ఆస్తులకో పన్నులు లేవు . కాని సామాన్య , మధ్య తరగతి ఉద్యోగులకు ఆదాయ పన్నులు , సర్వీసు పన్నులా ? పది రూపాయలతో రీచార్జ్ చేసుకునే పేద వాడికి . ఆ పది రూపాయల పైన 14.5% సర్వీస్ టాక్షా ? 0.5% స్వచ్చ భారత్ పన్నా ?
ఇలాంటి , ఖర్చు ను నియంత్రించాలనే గొప్ప ఆలోచన , ఖర్చును బట్టి ఆదాయ పన్ను , సంపద పన్ను విధించాలనే గొప్ప ఆలోచన , పన్నుల విధానాలను సులభతరం చేయాలనే గొప్ప ఆలోచన , 5 లక్షల నికర ఆదాయమున్న వ్యక్తులందరికీ ( ఆడ , మగ , సీనియర్ , సూపర్ సీనియర్ తేడా లేకుండా ) పన్ను మినహాయింపు మరియు రిటర్నులు వేయాల్సిన బెడద లేకుండా చేయాలనే గొప్ప ఆలోచన, ఇతరేతర పన్నులు సామాన్య , మద్య తరగతి , పేద ప్రజలపై పడకుండా చూడాలనే గొప్ప ఆలోచన రాజ్యాంగ వ్యవస్థలకు ( ముఖ్యంగా కేంద్ర మంత్రులందరికీ , సంభందించిన అధికారులకు) రావాలని మధ్య తరగతి , సామాన్య మరియు పేద ప్రజలు కోరు కుంటున్నారు .
No comments:
Post a Comment