Tuesday, March 8, 2016

"హైదరాబాదు లో అక్రమ కట్టడాలను కూల గొట్టకుండా ఏమి చేస్తే ఉపయోగముంటుంది ?


ప్ర . 
"హైదరాబాదు లో అక్రమ కట్టడాలను కూల గొట్టకుండా  ఏమి చేస్తే  ఉపయోగముంటుంది ?

జ . "హైదరాబాదు లో అక్రమ కట్టడాలను అన్ని సదు పాయాలతో ఉచిత సత్రాలుగా మార్చాలి" 

      
తెలంగాణలో అసలే విద్యావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి . ఈ మధ్య కాలం నుండే పేద, మధ్య తరగతి విద్యార్ధులు ఫీజులు రద్దు చేయడం వలన ఎంతో ఆసక్తి తో , అనేక మంది విద్యార్ధులు ఇంజినీరింగ్ , ఎం బి ఎ , బి .ఫార్మసీ, డిగ్రీలు , పి జి .లు చదివి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు .

ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే , ఒక వైపు ఉద్యోగ అవకాశాలు లేవు . మరో వైపు ఏవో కొన్ని ఉద్యోగాలకు అవకాశం వస్తే , విద్యార్ధులకు ఆంగ్ల భాషపై పట్టు లేక పోవడం వలన మరియు సాఫ్ట్ స్కిల్స్ లేక పోవడం వలన , ఇన్ఫీరీయారిటీ వలన , ఇంటర్వ్యూ లపై పూర్తీ అవగాహన లేక పోవడం వలన , కమ్మ్యూ నికేషణ్ సమస్యల వలన ఉద్యోగాలకు సెలెక్ట్ కాలేక పోతున్నారు . సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుందామని , సి ప్లస్ , జావా , డాట్. నెట్ కోర్సులు నేర్చు కుందా మని , బ్యాంక్ పరీక్షలకు కోచింగులకని , తెలంగాణా పబ్లిక్ సర్వీస్ ఉద్యోగాల కొరకు మరియు ఐ .ఎ .ఎస్ , ఐ. పి .ఎస్, ఐ. ఆర్ .ఎస్ లకు సెలెక్ట్ కావాలని సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే అనేక మంది విద్యార్ధులు మారు మూల గ్రామాల నుండి హైదరాబాద్ వచ్చి , హాస్టల్లో ఉంటూ , హోటల్లో తింటూ అనేక మైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .

అందు కని ప్రభుత్వమే విద్యార్ధుల సమస్యలను దృష్టి లో పెట్టుకుని, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుందామని , సి ప్లస్ , జావా , డాట్. నెట్ కోర్సులు నేర్చు కుందా మని , బ్యాంక్ పరీక్షలకు కోచింగులకని , తెలంగాణా పబ్లిక్ సర్వీస్ ఉద్యోగాల కొరకు మరియు ఐ .ఎ .ఎస్ , ఐ. పి .ఎస్, ఐ. ఆర్ .ఎస్ లకు సెలెక్ట్ కావాలని సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే అనేక మంది విద్యార్ధులు మారు మూల గ్రామాల నుండి హైదరాబాద్ వచ్చే విద్యార్దులకోరకు , హైదరాబాద్ లోని అవసరమైన బిల్దింగులను , అక్రమ కట్టడాలను కూల గొట్ట కుండా అనువైన చోట్ల సద్వినియోగం చేసు కోవాలి. "తిరుపతి లోని మాధవం శ్రీని వాస నిలయం " లాగ, ఉచిత సత్రాలుగా మార్చి , అన్ని సదు పాయాలతో ,పూర్తి రక్షణతో విద్యార్ధులు ఉండేందుకు అవకాశాలు కల్పించాలి .అవసరమైతే , తిరుపతి దేవస్థానం నుండి , కేంద్రం నుండి , ధాతల నుండి , కార్పోరేట్ సంస్థలనుండి నిధులు సేక రించాలి. 

అంతే కాకుండా , ఇక నుండి కొంత సిలబస్ తగ్గించయినా సరే , సాఫ్ట్ స్కిల్స్ ను రెగ్యులర్ గా చదివే కోర్సుల్లో భాగం చేయాలి . లేదంటే రేపు విద్యార్ధులే రాష్ట్రానికి పెను భారం కాగలరు .ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్ధులకు నిరుద్యోగ బృతి ఇచ్చి బిచ్చ గాండ్లుగా , సోమరులుగా తయారు చేయ వద్దు . దానికి బదులు గా , ఈ విధంగా విద్యార్దుల ఆదు కుంటూ , వారి మెదడుకు పని పెట్టి , మంచి సమర్ధులను తయారు చేసి , పనులు కల్పించి, దేశాభి వృద్దిలో భాగ స్వామ్యం చేయాలి .అధిక జనాభా ను (మానవ వనరులు ) మన దేశ సంపదగా గుర్తించాలి .

No comments: