ప్ర . అప్పులు ఎగ్గొట్టిన వారిని (WILLFUL DEFAULTERS) , " వీరు ఉద్దేశ్య పూర్వకంగా అప్పులు ఎగ్గొట్టిన వారు " అని వారి ఫోటోలను , పేర్లను , బ్యాంకులు ప్రకటించి నంత మాత్రాన ఏమైనా ఉపయోగం ఉంటుందా ?
జ . " తెగించిన వారికి తెడ్డే లింగం " అన్నట్లు , అప్పులు ఎగ్గొట్టిన వారిని (WILLFUL DEFAULTERS), " ఉద్దేశ్య పూర్వకంగా వీరు అప్పులు ఎగ్గొట్టిన వారు " అని వారి ఫోటోలను , పేర్లను , బ్యాంకులు ప్రకటించినంత మాత్రాన ఏమీ ఉపయోగం ఉండదు . పైగా దేశః ప్రజలందరికీ ఎవరికీ వారు ఏమి చేయవచ్చు , ఎలా చేయ వచ్చు , ఎలా అప్పులు ఎగ్గొట్ట వచ్చు, ఎలా తప్పించు కోవచ్చు అన్నట్లుగా (అర్ధం చేసుకునే రీతిలో) సందేశాన్ని పంపించి నట్లవుతుంది .
సామాన్య , మధ్యతరగతి వారికి లక్ష రూపాయల అప్పు ఇవ్వాలంటే , బ్యాంకులకు రెండు , మూడు సంవత్స రాల అధిక ఆదాయం గల ' ఐ.టి' రిటర్నులు ఇవ్వాలి , పాన్ కార్డు ఇవ్వాలి , ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఇవ్వాలి , 'సిబిల్' చెక్ చేయించు కోవాలి , ఒక సంవత్సరం బాంక్ ట్రాన్జాక్షన్స్ ఇవ్వాలి , 10 రెట్లు సెక్యూరిటీ ఇవ్వాలి . ఆ సెక్యూరిటీకి వాల్యుయేషన్ చేయించి ఇవ్వాలి , లీగల్ ఒపినీయన్ చేయించి ఇవ్వాలి , ఈ సి , ఇవ్వాలి , రెండు ఫోటోలు ఇవ్వాలి . అయినా నెలా , రెండు నెలలు కాళ్ళు అరిగేలా తిరిగినా , ఏదో ఒక లోపం చూపించి రిజెక్ట్ చేసిన లోను అప్లికేషన్స్ కోకొల్లలు .

అదే పలుకు బడి వారికి ,రాజకీయ నాయకులకు లేదా వారి బంధు మిత్రులకు , వారి కార్య కర్తలకు , పెద్ద పెద్ద వైట్ కాలర్ వ్యాపారస్థులకు ఏ సెక్యురిటీ లేకుండానే , ఏ 'సిబిల్' రిపోర్ట్ చూడ కుండానే వేల కోట్ల అప్పులు ఇస్తాయి . ఒక వేల నిజంగానే సేక్యూరిటే ఉంటే , అన్ని వేల కోట్ల అప్పులు ఎందుకు రాని బాకీలుగా , నిరర్ధక ఆస్తులుగా మారుతాయి .పెద్దల అప్పులు వసూలు చేయడానికి , వారి ఆఫీసుల ముందర ప్లే కార్డులు పట్టుకుని కూర్చోవడం , సామాన్యులకైతే నోటీసులిచ్చి ఆస్తులను వేలం వేయడమా ? బ్యాంకు అదికారుల భయాలకు కారణం ఏమిటి ? చట్టాలు సక్రమంగా లేక పోతే వారు అన్ని లక్షల కోట్ల బ్యాంకింగ్ వ్యాపారాన్ని ఎలా నడిపిస్తారు . మరి సామాన్యులకు అవే లోసుగులున్న చట్టాలు ఎందుకు వర్తించవు ? ఈ రాని బాకీలు , ఈ నిరర్ధక ఆస్తులు దేశ , విదేశీయుల సొమ్ము . ఇన్ని లక్షల కోట్లను ఓ 10 , 20 మంది బడా వ్యాపార వేత్తలు , బడా రాజ కీయ నాయకులు దోచుకుని పోతే ఎలా ? దేశ ప్రజలందరి నుండీ , వ్యాపార సంస్థలనుండీ ముక్కు పిండి వసూలు చేసిన పన్నులను బ్యాంకులను బలోపేతం చేయడానికి కెటాయిస్తారా ? అసలు దేశం ఎటు పోతుంది ? పేద వారు వాడే రూ .లు . 10/- సెల్ రీ చార్జ్ కార్డు పైన 12% నుండి 15% వరకు సర్వీస్ టాక్స్ రూపేన వసూలు చేస్తున్నారు . అలానే ఇతర వస్తువులపై పరోక్ష పన్నులు వ్యాట్ 14.5% , సి . ఎస్ . టి 2%, ఎక్సైజ్ 12%, ఎక్ష్ పోర్ట్ , ఇంపోర్ట్ పన్నులు , ఆక్త్రాయ్ మొదలైనవి , మరియు ప్రత్యక్ష పన్నుల రూపేనా ఆదాయ పన్నులు , టి .డి.ఎస్ , వెల్త్ టాక్ష్ , ప్రోఫెస్సినల్ టాక్ష్ మొదలైనవి వసూలు చేసి , అట్టి నిధుల నుండి ఈ రోజు బడ్జెట్ లో బ్యాంకులు నిల దొక్కు కోడానికి 25 వేల కోట్లను కేటాయించారు . రేపటి బడ్జెట్లో 50 వేల కోట్లను కేటాయిస్తారు . అన్ని వేల కోట్లనే సోలార్ ప్రాజేక్ట్ లకో , మానవ వనరులకో , ఆదార్ కార్డులు త్వరితగతిన జారీకి లేదా అన్నింటికీ కేటాయిన్చినట్లవుతే ప్రజలకు ఎంతో మేలు జరిగేది కదా . నేటి కాలంలో బ్యాంకులకు సర్వీస్ చార్జీల ద్వారానే అధిక ఆదాయం వస్తుంది . స్టేషనరీ కాస్ట్ తగ్గింది . ఆన్ లైన్ కారణంగా జీత భత్యాల కాస్ట్ తగ్గింది . ఇన్స్యూరెన్స్ ఖాతాల వలన ఆదాయం పెరిగింది . అయినా బ్యాంకులు నష్టాలను ప్రకటిస్తున్నాయి . లేదంటే లాభాలు తగ్గుతున్నాయి . ఎక్కడుంది లోపం ? ఎవరిదీ పాపం ? ఎవరకీ శాపం ?
"నిండా మునిగిన వారికి చలి ఉండదు అన్నట్లు" అప్పులు ఎగ్గొట్టిన వారిని ,
" ఉద్దేశ్య పూర్వకంగా వీరు అప్పులు ఎగ్గొట్టిన వారు (WILLFUL DEFAULTERS) " అని వారి ఫోటోలను , పేర్లను , బ్యాంకులు ప్రకటించినంత మాత్రాన , వారి వారి ఆఫీసుల ముందు ప్లై కార్డులు పట్టుకుని ధర్నా చేసినంత మాత్రాన ఏమీ ఉపయోగం ఉండదు . ఇది కేవలం బ్యాంకులను అడ్వర్టైజ్మెంట్ చేయడమో , ప్రజల చెవులలో పువ్వులు పెట్టడమో అవుతుంది , బ్యాంకు ఉద్యోగులకు మనో ధైర్యం కలిగించడమే అవుతుంది తప్పా మరే ఉపయోగముండదు . వీరికి వ్యక్తిగతంగా అప్పు పుట్టక పోవచ్చు కాని , వారి బార్యల పేరు మీద ,వారి పిల్లల పేరుమీద వారి బినామి పేర్ల మీదా పాన్ కార్డులు తీసుకుని అప్పు తీసుకుని , వ్యాపారాలు కొన సాగించుకోవచ్చు కదా . బ్యాంకుల నియమ నిభందనలు అందరికి సమానంగా ఉండాలి . అప్పుడే ప్రజలకు డిపాజిట్లు చేయ డానికి , బాండ్లు కొని పెట్టు బడులు పెట్ట డానికి నమ్మకం కుదురు తుంది . అలానే అప్పులు తీసుకుని సక్రమంగా చెల్లించ డానికి ఆలోచన , ఆసక్తి కలుగుతుంది .
బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరుగ డానికి ముఖ్య కారకులెవరు ?
" తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు " , బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరుగ డానికి ముఖ్య కారకులు వీరే అని ఇద మిద్దంగా చెప్పడం సాధ్యం కాదు . వ్యవస్థలలో లోపాలు , నియంత్రణలో లోపాలు , కమీషన్ ఏజెంట్లు , బ్యాంకు అధి కారులు , చిన్న పెద్దా అందరూ కారకులే .
బ్యాంకుల నిరర్దక ఆస్థులను తగ్గించాలంటే ఏమి చేయాలి ?

రాజకీయ నాయకుల జోక్యాలతో , అధికారుల స్వార్ధంతో నేడు అన్ని బ్యాంకులలో కలిపి సుమారుగా 6 లక్షల 40 వేల కోట్ల రూపాయలను రాని బాకీలుగా ప్రకటించడం జరిగింది . వాటిని ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి , ఫాస్ట్ ట్రాక్ పద్ధతి లో వసూలు చేసే ప్రయత్నం చేయాలి .రాజకీయ నాయకుల జోక్యాన్ని సాద్యమైనంత మేరకు తగ్గించాలి . బ్యాంకు అధికారులకు పూర్తి అధికారాలు కల్పించాలి . పూర్తి కాలపు చార్టెడ్ అకౌంటెంట్లను , చార్టెడ్ ఇంజినీర్లను నియమించు కోవాలి . ప్రాజెక్ట్ రిపోర్టులను జాగ్రత్తగా అసెస్స్ చేయాలి . అన్ని అప్పులకు , అందరికి సమానంగా 5, 6 రెట్లు సెక్యూరిటీ పెట్టు కోవాలి . తీసు కున్న అప్పు దేనికి వాడు తున్నారు , ప్రతినెలా లేదా 3 నెలల కొకసారి ఇన్స్పెక్షన్ చేయాలి . బ్యాంకు అది కారులపై నియంత్రణ ఉండాలి . " చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు " కాకుండా ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేయాలి . జాతీయ బ్యాంకులు కదా అని దోచుక తింటుంటే దేశ ఆర్ధిక పరిస్థితి కుప్ప కూలి పోతుంది . అందుకని ప్రతి ఒక్కరి నుండి , ప్రతి వ్యాపార సంస్థ నుండి ప్రతి రూపాయి వడ్డీతో సహా వసూలు చేయాలి . నిజాయితీ ప్రజలకు , నిజాయితీ వ్యాపార సంస్థలకు మనో ధైర్యాన్ని కల్పించాలి మరియు మోసాలు చేయడానికి అవకాశం కల్పించ కూడదు . అంతే గాని మరల బ్యాంకులకే 25 వేల కోట్ల నిధులు కేటాయించడం ద్వారా , ఇంకను ఎంత కావాలంటే అంత ఇస్తాము అనడం ద్వారా ప్రజలకు ఎటువంటి సందేశాన్ని పంపిస్తున్నారని సందేహం కలుగుతుంది . బ్యాంకులు నడిచేది ముఖ్యంగా సింహ భాగం ప్రజల డిపాజిట్ల తోనే అనేది మరియు ప్రజలు , వ్యాపార వేత్తలు అప్పులపై చెల్లించే వడ్డీలు , సర్వీస్ చార్జీల తోనే బ్యాంకులు ఆదాయాన్ని పొందుతున్నాయనే విషయాన్ని మరిచి పోకూడదు . ఒక సారి ప్రజలకు బ్యాంకులపై నమ్మకం సన్నగిల్లినా , బ్యాంకులు వివక్ష చూపినా , బ్యాంకులు పంపించే సందేశాన్ని ప్రజలు పూర్తిగా అర్ధం చేసుకున్నా , ఆ బ్రహ్మ దేవుడు దిగివచ్చినా ఇక బ్యాంకులు మన గలగడం కష్ఠ తరం కాగలదు . ఒక సారి ఒక ప్రైవేటు బ్యాంకులో చిన్న అనుమానం వచ్చి పుకార్లు లేస్తే , ప్రజలు వారి వారి ఖాతాల లోని డబ్బులను విత్ డ్రా చేసు కోడానికి క్యూ లు కట్టారు .
బ్యాంకుల అప్పులు "నివురు కప్పిన
నిప్పులు " అన్నట్లుగా ఉన్నాయి . బ్యాంకుల అప్పులను ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేసి , రాజకీయ జోక్యం లేకుండా , కుల మత వివక్ష చూప కుండా , చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి
నుండి నిర్భయంగా వసూలు చేయలేక పోతే లేదా వారి ఆస్తులను జప్తు చేయ లేక పోతే, ప్రజలకు బ్యాంకులపై నమ్మకం సడలి , బ్యాంకులలో డిపాజిట్లు
చేయడం కూడా మానేసే ప్రమాదముంది . ఇప్పడు పెరుగుతున్న షేర్ మార్కెట్ బ్యాంక్ ఇండెక్ష్ కూడా , కేవలం నీటిమీద
బుడగ మాత్రమే అని గుర్తుంచుకోవాలి .
No comments:
Post a Comment