Sunday, March 6, 2016

మనిషి క్రూరత్వం (CRUELTY) గా ఎందుకు మారుతున్నాడు ? ఎలా నివారించాలి ?

ప్ర . మనిషి క్రూరత్వం  (CRUELTY) గా ఎందుకు మారుతున్నాడు ?  ఎలా నివారించాలి ?

జ. సాధారణంగా  శిషువుగా  జన్మించే టప్పుడు , యే  బంగారు చేమ్చా నోట్ల బెట్టుకునో  , యే  దరిద్రాన్నో  పుక్కెట  పెట్టుకునో  పుట్టడు లేదా  పుట్టదు .  అయితే  ఒకటి మాత్రం నిజమనిపిస్తుంది . వారి తల్లి తండ్రు ల , తాత ముత్తాతల , అమ్మమ్మ , నానమ్మల , అత్తయ్యల , వారసుల  ' జీన్స్ ' ప్రకారం , వారి  ఆరోగ్యం , నడవడిక , మనస్తత్వాల  ప్రకారం పుడుతారని  నమ్మవచ్చు.  అయితే  , " పుట్టుకతో వచ్చిన  బుద్ది  పుడుకల లోనే పోతుంది " అనే దానిలో కొంత సత్యం లేక పోలేదు .  అలానే మనిషి  మరీ  ఏ  క్రూరత్వం తోనో , ఏ ద్వేషం తోనో , ఏ ఈర్ష్య తోనో ఏ  అసూయ తోనో  జన్మించడు లేదా జన్మించదు . పుట్టిన తరువాతనే  పోషించే కుటుంభం ప్రభావం వలన , పెరిగిన విధానం వలన  , చెడు  స్నేహితుల  సాంగత్యం వలన ,     పరిసరాల  ప్రభావం వలన , వాతావరణం ప్రభావం వలన , చుట్టూ ఉన్న సమాజం ప్రభావం వలన , సినిమాలు , టీ . వీ . ల  , ఇంటర్నెట్ ల  ప్రభావం వలన , వ్యవస్థల తీరు వలన , పాలకుల  పరిపాలనా విధానాల వలన , చట్టాలలో  సమానత్వం  లేక పోవడం  వలన , చట్టాలలో  మినహాయింపులు  ఉండటం వలన , తెలివైన  లాయర్ల వాక్పటిమ పైనా , ధన జన  మధ  బల  ప్రభావం వలన ,  ఒక్కో సారి  వాటిని అలుసుగా   తీసుకుని , ఆసరాగా చేసుకుని       " నేను అనుకున్నది ఏదో విధంగా  సాధించాలి . నన్ను ఎవ్వరూ ఏమి చేయ లేరు ,  నాకు ఎవ్వరూ  ఎదురు  చెప్ప లేరు  . నాకు  ఎవ్వరూ అడ్డు పడలేరు  . నాకు దక్కంది  మరొకరికి దక్క కూడదు  అనే అహంభావం  కసి , మొండి తనం " ఒక్క మాటలో చెప్పాలంటే  అరిషడ్  వర్గాలైనటువంటి , కామ , క్రోధ , మోహ , లోభ , మధ , మాత్సర్యములన్నీ  , ఒకే మనిషి ఆలోచనకు,  ఒకే సమయాన రావడం  వలన  మనిషి క్రూరత్వంగా  మారుతున్నాడని లేదా మారుతుందని  చెప్పవచ్చు .  

ఇక్కడ  మనం  మనిషి క్రూరంగా మార డానికి  గల కారణాలు  తెలుసుకున్నాము . 
అందుకని  మనిషి క్రూరంగా మార కుండా  ఉండ డానికి  , అవే కారణాలను   సవరిస్తూ ,  వ్యవస్థలు , ప్రభుత్వాలు , చట్టాలు , సమాజం   నిజాయితీగా  నడుస్తూ  , మనిషిలో   నైతికతను పెంచుతూ , వారి  దృష్టిని ఆధ్యాత్మికత  వైపు మరల్సితే ,   మనిషి  క్రూరంగా మారక పోవచ్చు .  అప్పుడు  ఆ మనిషి బాగు పడుతాడు  లేదా  బాగు పడు తుంది ,  సమాజం బాగు పడు తుంది .  దేశం బాగు పడు తుంది  , ప్రపంచమూ   బాగు పడు తుంది  .  
సర్వే  జన: సుఖినో భవంతు !

No comments: