Sunday, March 27, 2016

WHY ONE SHOULD GET MARRAGE & WHOM ? వివాహం (పెండ్లి) ఎందుకు చేసుకోవాలి ? ఎలాంటి వారిని వివాహం ( పెండ్లి) చేసు కోవాలి?

ప్ర . వివాహం (పెండ్లి)  (MARRIAGE ) ఎందుకు చేసుకోవాలి ?  ఎలాంటి వారిని వివాహం  ( పెండ్లి)  చేసు కోవాలి?
జ . వివాహం (పెండ్లి) (MARRIAGE ) అనేది  సృష్టి  నియమం .  దైవ  నిర్ణయం . వివాహం (పెండ్లి) వలన  ఒక స్త్రీ , పురుషుడు  కలిసి  చట్ట బద్దంగా , ధైర్యంగా కల్సి జీవించే  అవకాశం లభిస్థుంది . వివాహం (పెండ్లి)  వలన  స్త్రీ  , పురుషులు  భార్యా భర్తలుగా ఒకే ఇంట్లో నివసిస్తూ , సమాజంలో  తలెత్తుకుని తిరిగే  ధైర్యం ఏర్పడుతుంది .  వివాహం (పెండ్లి)  వలన  సంతానోత్పత్తికి  అవకాశం  కలుగుతుంది . వివాహం (పెండ్లి)  వలన  , జీవించినంత కాలం  బార్యకు భర్త , భర్తకు భార్య  తోడూ నీడగా , అండగా , ఆసరాగా  జీవించే అవకాశం ఏర్పడుతుంది . అంతే కాదు  సమాజంలో అనేకమైన సమస్యలకు  వివాహం (పెండ్లి)  చెక్ పెడుతుంది .  ముతైదువుగా  సుభ కార్యాలుకు  వెళ్ళాలన్నా , కిరాయీలకు ఇండ్లు  దొరకాలన్నా . ప్రభుత్వ  సంక్షేమ  పధకాలు అందాలన్నా  వివాహం (పెండ్లి)  తప్పని సరి . 
ఎలాంటి వారిని వివాహం  ( పెండ్లి) ( MARRIAGE) చేసు కోవాలి?
చట్ట ప్రకారం  వివాహాలు (పెండ్లిళ్ళు )  (MARRIAGES) ఆడ వారికి  18  , మగ వారికి 21 సంవత్సరాల వయస్సు  దాటినా తరువాతనే చేయాలి . ఒక వేల  అంత కుంటే ముందే వివాహం (పెండ్లి)  జరిపించినట్లవుతే  లేదా చేసు కున్నట్లవుతే  చట్ట ప్రకారం నేరం  జైలు శిక్ష , జుర్మానా  విధించ వచ్చు .  వివాహం (పెండ్లి)  అనేది  మూడు ముళ్ళు , జిలుకర బెల్లంతో ఒకటయ్యేది  కావచ్చు కాని , నూరు సంవత్సరాలు ప్రేమగా , ఎలాంటి  సమస్యలు , బాధలు , కష్టాలు  లేకుండా కల్సి జీవించ వలసినది కూడాను. మరో తరాన్ని సృష్టించాలి  . తర తరాలకు కావల్సింది అందించాలి , నేర్పాలి .   తర తరాలకు ఆదర్శంగా జీవించాలి .   అలాంటి  సృష్టికే పవిత్రమైన వివాహం (పెండ్లి)   చేసుకునేటప్పుడు  యువతీ , యువకులు కేవలం  అందాన్ని చూసో , వరకట్నం ఇస్తారనో , వరకట్నం  ఇస్తామనో ,, వెనుకాల డబ్బును చూసో ,  ఆస్తులను చూసో , మాటలను చూసో , డాబు సరిని చూసో , పలుకుబడిని  చూసో ,  సోకులను  చూసో , నాజూగ్గా ఉన్నారనో  వివాహం (పెండ్లి)  చేసుకో కూడదు . తెలుగులో ఒక సామెత వాడుకలో  ఉంది  . " అందమైన ఆడది , లేదా మగాడు  శత్రువుతో  సమానం " అని .  తరిచి చూస్తే   నిజ జీవితం లో  అనేక  మైన సంఘటనలు  చూసే ఉంటాము , చూస్తూనే  ఉంటాం . వాస్తవంగా జరిగేది కూడా అదే . నిజ జీవితంలో జరుగు తున్నది కూడా అదే . వివాహం (పెండ్లి)  కి ముందే  యువతీ యువకులు  అందం గురించి  ఎన్నెన్నో ఉహించుకుంటారు . ఎన్నెన్నో కలలు  కంటారు  . ఎన్నో ఆశలు పెంచుకుంటారు . అది సహజం .( కాని భూమి మీద నిల్చుని  ఆకాశాన్ని  తాకుతూ ఆడుకుంటా అని కోరికలు పెంచు కోవడం  భవిష్యత్తులో  కొంత ఇబ్బందికి గురి చేయ వచ్చు .)  తాళి కట్టిన మరుసటి నిమిషం నుండి , ఒకరి పై మరొకరికి  హక్కులు పెరుగుతాయి . బాధ్యతలు పెరుగుతాయి . నా భార్య అని లేదా  నా భర్త అని విపరీతమైన  ఇష్టం ఏర్పడుతుంది . నా  అందమైన భార్య పై  ఎవరి దృష్టి పడ  కూడదని , ఎవరూ మాట్లాడ కూడదని , అలానే నా  అందమైన భర్త  పై  ఎవరి దృష్టి పడ  కూడదని , ఎవరూ మాట్లాడ కూడదని  అతి ప్రేమ తో  ఉంటారు . అదే కంటిన్యూ  అవుతూ అపోహలు ,  అనుమానాలకు  దారి తీస్తుంది  , అవి శృతి  మించితే  అవమానాలు , కొట్లాటలు , చికాకులూ  పెరిగి జీవితం నరక ప్రాయం అవుతుంది . అభివృద్ధి పై పట్టు సడలు ( తగ్గు ) తుంది. భార్య భర్తల  కొట్లాటలు పెరుగుతాయి , రోడ్డుపైన పడుతారు , పోలేస్స్ స్టేషన్లకు ,  కోర్టుల దాకా  వెలుతారు . అనుమానాల వలన  విడాకులు ,  హత్యలు,  ఆత్మ హత్యలు చేసుకుంటారు . కుటుంభాలు , జీవితాలు , బంధాలు , బంధుత్వాలు  చీకటి మాయం అయినవి అనేకమున్నాయి . ( అయితే గతంలో చెడు అలవాట్లు ఉన్నవారు , విశాల హృదయం గల వారు  , ఎవరి ఇష్టం వారిదే అనుకునే వారు ,  డబ్బుకు కక్కుర్తి పడే వారు , అసమర్దులు , బల హీనులు   ఇందుకు మినహా హింపు గా  భావించ వచ్చు ). 
అందుకని వివాహం (పెండ్లి) (MARRIAGE ) చేసుకునే ముందు ,   మొదట  వారి క్యారెక్టర్ ను , వారి మనస్సును , వారి నిజాయితీని , వారి నమ్మకాన్ని , వారి  పట్టుదలను , వారి ఆర్ధిక క్రమ శిక్షణను , వారి స్వయం శక్తిని , వారి విద్యను , ఉద్యోగాన్ని , ఆరోగ్యాన్ని  , వారి  నిలకడ  తత్వాన్ని చూసి  , ఆ తరువాత నే  అందం  , నాజూకు తనం , డబ్బు  మొదలైనవి  చూడాలి .  అలానే  ఆకర్షణకు లోనయ్యో  , ఇగోతోనో , శరతులతోనో  , ఇతరుల వత్తిడితోనో , చిన్న వయసులోనే పెంచి పోషించిన  , విద్యా  బుద్దులు  నేర్పిన  తల్లి దండ్రుల  ఇష్టం లేకుండా    ప్రేమ వివాహాలు చేసుకో కూడదు .  ఇలాంటి  ప్రేమ  వివాహాలు  చేసుకోవడం  వలన 70%  వివాహాలు  చెడి పోవడమో , విడాకులు తీసుకోవడమో ,  ఆత్మ హత్యలు చేసుకోవడమో జరుగుతుంది .  




No comments: