Thursday, March 3, 2016

" ఆధార్ కార్డు" (AADHAR CARD) ను చట్టబద్దం చేయాలా ? దాని వలన ఉపయోగాలు ఏమి ?

ప్ర . " ఆధార్ కార్డు" (AADHAR CARD)ను చట్టబద్దం  చేయాలా ?  దాని వలన ఉపయోగాలు ఏమి ?


జ . అవును  చేయాలి . " ఆధార్ కార్డు" (AADHAR CARD)  వలన  ప్రభుత్వాలకు , వేల కోట్ల మిగులును  దృష్టిలో పెట్టుకుని , నిజాయితీ  ప్రజలకు  కలిగే  మేలును  దృష్టిలో పెట్టుకుని  " ఆదార్ కార్డు"  ను  చట్ట బద్దం చేయాలి . రాజ్యాంగ  బద్దం చేయాలి .సాధారణంగా , ప్రతి వ్యవస్థ  ఆలోచనకూడా , ప్రజలందరికి  సమ న్యాయం కలుగాలనే . ప్రతి వ్యవస్థ  ఆలోచన కూడా  ప్రభుత్వ  వృధా వ్యయాన్ని తగ్గించడమే . అందుకని  ప్రతి వ్యవస్థా  " ఆధార్ కార్డు"  ల  తప్పని సరి అనుసంధానానికి వారి ఆలోచనలను  పునః  పరిశీలించాలి .  " ఆదార్ కార్డు"   చట్ట బద్దతకు  చేయూత నివ్వాలి .  ప్రజలకు  కలిగే  మేలును  దృష్టిలో పెట్టుకుని , దేశ అవినీతి నిర్మూలనను  దృష్టిలో పెట్టుకుని, నిష్పక్ష పాత  పరిపాలనను  దృష్టిలో పెట్టుకుని   " ఆధార్ కార్డు"  ను  చట్ట బద్దం  చేయడానికి  , బిల్లు పాస్ కావడానికి  సభ్యులందరూ  సహకరించాలని  ప్రజలు  కోరుకుంటున్నారు  . అంతే  కాదు  బిల్లు పాస్ చేయ డానికి  సహక రించని  సభ్యులను  ఓటర్ల  దృష్టికి తీసుక  రావాలని  ప్రజలు కోరుకుంటున్నారు .   

అంతే  వేగంగా , " ఆధార్ కార్డు" ను  ప్రతి ఒక్కరికి అతి త్వరగా ఉచితంగా ఇష్యూ చేయాలి . అర్హులైన ఏ  ఒక్కరూ సంక్షేమ పధకాలు పొంద కుండా ఉండ కూడదు . అదే సమయంలో అనర్హులకు తావుండ కూడదు . అందుకని ప్రతి సంక్షేమ పధకాలలో మరియు ప్రతి వ్యవ హారంలో   ( అనగా , బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినా , డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా , పాన్ కార్డు కు అప్ప్లై చేసినా , పాస్ పోర్టుకు అప్ప్లై చేసిన , భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నా , వోటర్ కార్డుకు అప్ప్లై చేసినా , గ్యాసుకు అప్ప్లై చేసినా , ఉద్యోగానికి అప్ప్లై చేసినా , కుల , ఆదాయ ధ్రువ పత్రాలకు అప్ప్లై చేసినా మరియు ఇతర సంక్షేమ పథకాలన్నిటికి  ) నిర్బంధం చేయాలి . అప్పుడే అవినీతి కంట్రోల్ అవుతుంది . అప్పుడే రాష్ట్రాలకు , కేంద్రానికి వేల కోట్ల ఆదాయం అందుబాటు లోకి వస్తుంది . ఎంత ఆలస్యం చేస్తే అంత అవినీతి పెరుగుతుంది . ప్రభుత్వాలకు  అంత నష్టం జరుగుతుంది . ఆ  నష్టం  పేద ప్రజలు భరించాల్సి ఉంటుంది . ప్రబుత్వ లోటు బడ్జెట్  పెరుగుతుంది . 


శుభ వార్త " ఆధార్ కార్డుల " (AADHAR CARDS) చట్ట బద్ధత కు  సంభందించిన బిల్లుకు  ది. 11.03. 2016 న ఆమోద ముద్ర  పడింది . 

No comments: