ప్ర . న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ( స్వయం ప్రతి పత్తి) అధికారం ఉండాలా ?
జ. న్యాయ వ్యవస్థలో ప్రస్తుతమున్న ” కొలీజియం ” విధానాన్నే కొన సాగించాలి .
అసలు ” కొలీజియం” అంటే ఏమిటి ? నలుగురు అత్యంత సీనియర్ న్యాయ మూర్తుల ధర్మాసనం సూచనతో , సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తి , న్యాయ వ్యవస్థ లోని వారినే సుప్రీం కోర్ట్ , రాష్ట్ర హై కోర్టుల న్యాయ మూర్తులుగా నియమిస్తారు . న్యాయ మూర్తుల నియామకాలనే కాకుండా , ట్రాన్స్ఫర్ ల ను మరియు ప్రమోషన్లను చేపడుతారు . దీనికి గవర్నరు , రాష్ట్ర పతి ఆమోద ముద్ర తప్పని సరి. ఈ నలుగురు సభ్యులలో అత్యంత సీనియర్ న్యాయ మూర్తులు తప్పా ఇతర వ్యవస్థ ల లోని సభ్యులు ఎవ్వరూ ఉండరు .
అయితే ఇప్పుడు ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా తీసు కొచ్చిన కొత్త విధానం ఏమంటే , న్యాయ మూర్తుల నియామకాలను పార దర్శకంగా , విశాల ప్రాతి పదికన చేపట్టడానికంటూ ” జాతీయ న్యాయ నియామకాల కమీషన్ ” (ఎన్. జె . ఎ . సి . ) ని ఏర్పాటు చేశారు . న్యాయ శాసన వ్యవస్థల నుండే కాకుండా , పౌర సమాజం నుంచి , పార్ల మెంటరీ వ్యవస్థ నుండీ ప్రజా ప్రతినిధులు ఉంటారు . అనగా ఇందులో , సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి , ఇరువురు అత్యంత సీనియర్ న్యాయ మూర్తులు , న్యాయ శాక మంత్రి మరియు ఇరువురు ఉన్నత మైన మేధావులు ( వీరిని సూచించే వారిలో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి కూడా ఉంటాడు .)దీనిని సుప్రీం కోర్ట్ 16.10.2015 న కొట్టివేసింది .
సుమారుగా 70% అనేక కులాల , మతాల , ప్రాంతాల , దేశాల సామాన్య ప్రజలున్న భారత దేశంలో , వారు కొంత వరకైనా ధైర్యంగా, ప్రశాంతంగా , ఆత్మాభిమానంతో జీవించాలంటే , న్యాయ వ్యవస్థలో రాజకీయ నాయకుల జోక్యం ఉండ కూడదు . కొందరంటారు , రాజకీయ నాయక సభ్యులు కేవలం సూచనలు చేస్తారు , మిగిలిన సభ్యులు నచ్చక పోతే వ్యతిరేకించ వచ్చు,అని . ఇక్కడే ఒక గొప్ప తిరకాసు ఉంది . ఆ రాజకీయ నాయకుడి సభ్యుడి వెనుకాల , మొత్తం కేంద్ర , రాష్ట్రాల ప్రభుత్వాల పాలకులు ఉంటారు . వారి వద్ద ఎంతటి అధికారం , డబ్బు బలం ,కార్య కర్తల బలం ఉంటుందో అందరికి తెల్సిన విషయమే . అలాంటప్పుడు , ఆ రాజకీయ సభ్యుడి సూచనను వ్యతిరేకించే దమ్ము , ధైర్యం ఎవరికీ ఉంటుంది చెప్పండి . కనీసం ఇప్పుడు కోర్టు తీర్పులను గౌరవిస్తున్నారు , పాటిస్తున్నారు . విమర్శించే సాహాసం కూడా ఎవ్వరూ చేయడం లేదు
కాని రేపు అలా ఉండదు . ప్రతి తీర్పు విమర్శకు తావు ఉంటుంది . రాజకీయ సభ్యుల సూచనలను వ్యతిరేకించే ఇతర సభ్యులు బిక్కు బిక్కున బ్రతుకాల్సి ఉంటుంది . న్యాయ మూర్తులకు తీర్పులు నచ్చక స్వచ్చంద విరమణ చేయ వచ్చు . అప్పుడు వ్యవస్థ మరల తిరోగమన దశలో నడువ వచ్చు .” కొలీజియం ” విధానంలో ఏమైనా లోపాలు ఉంటే సూచనలు చేయ వచ్చు . సవరణలు చేయ వచ్చు . న్యాయ మూర్తులను నియామకం చేసే అత్యంత సీనియర్ న్యాయ మూర్తులను ప్రభుత్వాలు సిఫారస్ చేయ వచ్చు . కాని ఎట్టి పరిస్థితులలోనూ న్యాయ వ్యవస్థలో , ఎన్నికల సంఘంలో , రిజర్వు బ్యాంకులో మరియు అన్ని నియంత్రణ సంస్థలలో రాజకీయ నాయకులకు సభ్యత్వం ఉండ కూడదు . వీటికి స్వతంత్ర ( స్వయం ప్రతి పత్తి) అధికారం ఉండాలి . అలా అని , ఏ వ్యవస్థను , ఏ సార్వ భౌమాదికారాన్ని కించ పరిచినట్లు కాదు . వేటి పరిధి వాటివే . వేటి అధికారాలు వాటివే .వేటి భాధ్యతలు వాటివే . వేటి గౌరవాలు వాటివే .
1000 కోట్ల కుంభ కోన దారులకు అత్యధికంగా 7 సంవత్సరాలు శిక్ష విధిస్తే ,100 రూపాయల దొంగలకు ఎన్నోరెట్లు మానసిక , శారీరక శిక్షలుంటున్నాయి . 1000 కోట్ల నల్ల ధన కుభేరులను ఏ . సి .లో , విచారిస్తే , 100 రూపాయల దొంగలను థర్డ్ డిగ్రీతో విచారిస్తున్నారు . పొట్ట కూటి కోసం చేసే 100 రూపాయల దొంగలకు వెంటనే శిక్షలు పడుతే , తర తరాల కోసం దాచిపెట్టే 1000 కోట్ల అవినీతి పరులకు యేండ్ల తరబడి శిక్షలుండవు . ఈ లోగా మల్లీ ఎన్నికలలో పోటీ చేస్తారు . గెలుస్తారు .
ఎవ్వరైనా పనిచేసేది 12 గంటలే . ఎవ్వరైనా తీసుకునేది ఆహారమే . ఎవ్వరికైనా ఉన్నవి రెండే చేతులు , రెండే కాళ్ళు , ఒకటే శిరస్సు , ఒకటే మొండెం . కాని కొందరే కొద్ది కాలం లోనే కోట్లకు పడగలెత్తు తున్నారు . మరికొందరు జీవితాంతం పేద రికంలోనే మ్రగ్గు తున్నారు , బిక్షాటనే చేస్తున్నారు . అదే అక్రమంగా సంపాదించే వారు కోట్లల్లో సంపాదిస్తూ హాయిగా జీవిస్తున్నారు . నిజాయితీ పరులు దినమొక గండంగా కాలం వెల్లదీస్తున్నారు . ఎక్కడుంది లోపం ? కనిపెట్టడం ఎలా ? అరికట్టడం ఎలా ? నల్ల ధనం దేశంలో , విదేశాలల్లో లక్షల కోట్లు అనుత్పాదక శక్తి గా మ్రగ్గు తుంది . ఇలాంటి సమయంలో న్యాయ వ్యవస్థకు , స్వతంత్రత లేకుండా చేయడ మంటే ప్రజా స్వామ్యాన్ని బలహీన పరచడమే అవుతుంది .
అందరికి సమాన న్యాయం అందాలంటే , ఇప్పుడున్న ” కొలీజియం ” విధానం లో నేటి పరిస్థితులకు అనుగుణంగా అన్ని వ్యవస్థల , ప్రజల సూచనలు , సలహాలతో మరిన్ని మార్పులు చేయ డానికి అవకాశం ఉండాలి . మరిన్ని మార్పులు చేయాలి . సామాన్య పేద ప్రజలకు రక్షణ కల్పించాలన్నా , అవినీతి పరుల , నల్ల ధన కుబేరుల ను శిక్షించాలన్నా , న్యాయ వ్యవస్థలో , రాజ కీయ నాయకుల ప్రవేశం ఉండ కూడదు . ప్రస్తుతం అనేకమైన అసాంఘీక శక్తులకు , అవినీతి పరులకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లభిస్తుంది . ఎలాగో అలాగా డబ్బు ఎగజల్లి గెలుస్తున్నారు . ఎన్నికల సమయంలో డబ్బు దొరికినా ఎవరికీ శిక్షలు పడిన దాఖలాలు లేవు . డబ్బు ఎగజల్లిన వారు , దానిని వడ్డీతో సహా పది రెట్లు అధికంగా సంపాదించు కోవాలని చూస్తున్నారు . ఏదో విధంగా గెలిచినా వారు , ప్రజలకు తెలియ కుండానే శాషనాలు చేస్తున్నారు . దానిని ప్రజలపై రుద్దు తున్నారు . రాష్ట్ర పతి ఎన్నికలకు విప్ లు జారి చేస్తున్నారు . ఇలాంటి కాలంలో , సామాన్య పేద ప్రజలకు , ఒకే ఒక దిక్కుగా ఉన్న , జుడీష్యరీ వ్యవస్థలో కూడా , రాజకీయ నాయకులు ప్రవేశిస్తే , సామాన్య పేద ప్రజల భవష్యత్ ఏమౌతుందో మేధావులు ఆలోచించి నిర్ణయాలు తీసు కోవాలి . సుప్రీం కోర్ట్ తీర్పును వ్యతిరేకించే వారు ఏ వర్గానికి చెందిన వారు ఉంటున్నారో , సమర్ధించే వారు ఏ వర్గానికి చెందిన వారు ఉంటున్నారో క్షున్నంగా పరిశీలించాలి . అప్పుడు విషయం భోధ పడుతుంది . కేవలం ఒకే ఒక పాయింట్ , రాజ్యాంగ బద్ధమైన కమీషన్ అని కాకుండా , మెజార్టీ ప్రజల భవిష్యత్ , ఆర్ధిక అసమానతలు , అవినీతిని , నల్లదనాన్ని అరి కట్టే మార్గాలు అదో గతి పాలు కాకుండా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది . అధికారం చేతికి రాగానే దేశం లోని , రాష్ట్రాల లోని సంపద అంతా పాలకులది గానే భావించే రోజులు పోవాలి . ప్రభుత్వ ఉద్యోగం రాగానే మాదే అధికారం అనుకునే కాలం మారాలి . ఇలాంటి విషయాలలో కట్టడికి న్యాయ వ్యవస్థ లో మార్పులు తీసుకుని రావాలి . సాధారణంగా , సామాన్యులకు , పేదలకు శిక్షలుండ కూడదు . కుంభ కోన దారుల , నల్ల ధన కుభేరుల , అవినీతి పరులకు సత్వర ఖటిన పారదర్శకమైన శిక్షలు విదిస్తూ , సామాన్యుల , పేద వారిలో ఒక భయానక వాతా వరణాన్ని క్రియేట్ చేయాలి . అప్పుడు అందరూ భయ పడుతారు . ఎవ్వరూ తప్పులు చేయరు . దేశ మంతటా విశ్రాంత న్యాయ మూర్తులచే న్యాయ అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలి . ఈ విధంగా చేయడం వలన కోర్టుల్లో కేసులు కూడా తగ్గుమొఖం పడుతాయి . న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే , అంత పేద , సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది . భద్రత లభిస్తుంది . సుఖ సంతోషాలు లభిస్తాయి . ధైర్యముంటుంది . లేదంటే రాజకీయ నాయకులదే , వారి కార్య కర్తలదే , బలమున్న వారిదే, అవి నీతి పరులదే , బడా అక్రమ వ్యాపార వేత్తలదే ,మోస కారులదే రాజ్య మవుతుంది .