అంశం: కుంభమేళ
శీర్షిక: *మహా కుంభమేళ*
ఇది ఒక అద్భుతమైన మేళ
ఉట్టి పడుతుంది అచట జీవ కళ
నిత్యం మెరుస్తాయి కాంతులు తళతళ
హిందువులు ఐక్యత నిరూపించే వేళ!
*కుంభ* మనగా కలశం,
*మేళ* అనగా సమూహం
కుంభమేళ నాయె నటుల
ముక్తి పొంద ప్రజలు ముదముతోడ!
అమృత కలశం నుండి జారిన
నాలుగు అమృత చుక్కలు
ప్రయాగ్, హరిద్వార్, నాసిక్ మరియు
ఉజ్జయినీ ప్రాంతాలలో పడె !
భారత దేశం, హైందవ, సనాతన
ఆధ్యాత్మికత సంస్కృతి
సాంప్రదాయాలకు ఎంతో పేరుగాంచినది
హిందూ ప్రజల ఐక్యతకు అద్భుత వరం
నేడు జరుగతున్న *మహా కుంభమేళ* ప్రదేశం
*ప్రయాగ* గంగా, యమునా మరియు
సరస్వతి నదుల సంగమం!
నూటా నలుబది నాలుగు సంవత్సరాల
కొక సారి జరుగు *మహా కుంభమేళ*
పుష్య పౌర్ణమి రోజున మొదలై
మహా శివరాత్రి వరకు జరుగు
అపురూప మహోత్సవం
ఇది నలుబది ఐదు రోజుల మేళ
కోట్ల మంది భక్తులు, లక్షలాదిమంది
సాధువులు, నాగ సాధువులు,
అఘోరాలు వచ్చు మహాత్తర వేళ!
ఉషోదయ, సంధ్యావేళ గజ వనికే చలి
కుంభ మేళ అచ్చెరెవు నొందే భక్తుల జాతర
మనిషి మనిషికి కనబడని మంచు తెరలు
త్రివేణి సంగమంలో స్నాన మాచరించిన
కలుగు మోక్షం , విష్ణువు కటాక్షం
కోట్లాది భక్తులు వచ్చినా అచ్చెరువొందే ఏర్పాట్లు
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆదిత్య యోగికి
*మహా కుంభమేళ* ఒక విషమ పరీక్ష