అంశం: ధర్మ అర్థ కామ మోక్ష
శీర్షిక: *చతుర్విధ పురుషార్ధాలు*
చతుర్విధ పురుషార్ధాలు
అవియే ధర్మ అర్థ కామ మోక్షం
ఈ పురుషార్ధాలలో
*అధిక ప్రాధాన్యత గలది ధర్మం*
విశ్వంలో జీవకోటి జీవనం సాగించాలంటే
పంచ భూతాల ఎంత ముఖ్యమో
కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే
చతుర్విధ పురుషార్ధాలు అంతే ముఖ్యం
అందుకే అంటారు;
*ధర్మో రక్షతి రక్షితః*
ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుంది
''ధర్మం" అనగా నీతి నిజాయితీ
న్యాయ బద్దంగా నడుచుకోవడం
"అర్ధం" అనగా డబ్బు, విలువ
"కామం" అనగా కోరిక,అది ఏదైనా కావచ్చు
"మోక్షం" దైవంలో లీనమవడం , మోక్షం
పొందడం
ధర్మార్థ కామ మోక్షాలు కలిగి యుండు
ఒకదాని కొకటి అవినాభావ సంబంధము
అలానే,ఒకదానిపై నొకటి ఆధారపడుతుండు
లయబద్ధంగా తిరుగుతుండు
ప్రతి వ్యక్తి జీవితంలో, జీవితమున్నంత వరకు
ప్రతి మనిషికి ఉంటాయి సహజ కోరికలు
కోరికలు తీరాలంటే కావాలి డబ్బు
డబ్బు అనేది రావాలి ధర్మ బద్ధంగా
ధర్మ బద్ధంగా నడుచుకుంటే మోక్షం తధ్యం
ప్రతీ వివాహ వేడుకలలో
పంతులు గారు పఠింప జేస్తారు
దైవ సన్నిధిలో వధూవరులతో
పంచ భూతాల సాక్షిగా వేద మంత్రాలతో
*ధర్మేచా, అర్ధేచా, కామేచా,మోక్షేచా*
*నాతి చరితవ్య* అంటూ ఉభయులతో
విడివిడిగా కలివిడిగా పఠింప జేస్తాడు
కొందరు మోక్షేచా పఠించవద్దని అంటారు
ధర్మ బద్ధంగా, డబ్బు పరంగా,కామ పరంగా
ఎలాంటి అరమరికలు, దాపరికాలు
మనఃస్పర్ధలు, అపోహలు లేకుండా
జీవిత కాలం కలిసి మెలిసి ఉంటామని
వధూవరుల మనఃస్సాక్షితో , పెద్దల యెదుట
ప్రమాణం చేయిస్తారు
కుటుంబ వ్యవస్థ సుస్థిరంగా నిలువ డానికి
మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో
ధర్మార్థ కామ మోక్షాలకు పెద్ద పీట వేసారు
No comments:
Post a Comment