శీర్షిక: *హాపీ న్యూఇయర్*
(గేయాలు)పల్లవి:
ఆమె:
కొత్త కొత్త ఆలోచనలతో.
కొంగ్రొత్త విధానాలతో ... "కొత్త"
ముందుకు సాగుదాం..
మునుముందుకు సాగుదాం... "ముందుకు"
లక్ష్యాలను సాధిద్దాం.... "2"
విష్ యు హ్యాపీ న్యూ ఇయర్.. "2"
చరణం:01
ఆమె:
కోరికలకు కళ్ళెం వేస్తూ...
ఆశలను అదుపున పెడుతూ... "కోరిక"
అతడు:
ఊసులు ఎన్నో చెప్పుకుంటూ...
ఉన్నతంగ గడుపుదాం .... "2". "విష్ యు" "కోరస్"
చరణం: 02
ఆమె:
వాగులు వంకలు తిరుగుకుంటూ...
ఆడుతు పాడుతు అడుగులు వేస్తూ... "2"
అతడు:
అనుకున్నది సాధిద్దాం...
అందమైన బిడ్డకు జన్మనిద్దాం.. "2"
విష్ యు హ్యాపీ న్యూ ఇయర్.... "2" "విష్ యు"
"కోరస్"
చరణం:03
ఆమె:
నింగీ నేలా తాకేటట్లూ....
మేనూ మేనూ తగిలేటట్లూ.... "2"
చెంగు చెంగున ఎగరుదాం...
చెరో పని చేసుకుందాం..... "2"
అతడు:
చట్టా పట్టా లేసుకుంటూ...
చంటి పిల్లను ఎత్తుకుని.... "2"
చెంగు చెంగున ఎగురుదాం...
సన్నిహితంగా కలిసి ఉందాం...... "2".
విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ "2" "కొత్త" "కోరస్"
No comments:
Post a Comment