Wednesday, January 29, 2025

సీగ్నేచర్


అంశం: సిగ్నేచర్

శీర్షిక: *చెరగని ముద్ర*

అస్థిత్వం నీ ఉనికి
వ్యక్తిత్వం నీ సిగ్నేచర్!

*నీవు ఎక్కడ జన్మించావు అనేది కాదు*
*నీవు ఎక్కడికి చేరుకున్నావు అనేది ముఖ్యం*

*బురదలో పుట్టినా, కమలం పరిమళాలు*
*చివరికి చేరుతాయి విష్ణువు పాదాల చెంతకు*

*కడు పేదరికంలో పుట్టిన డా.అబ్దుల్ కలాం*
*గొప్ప సైంటిస్ట్ , దేశ రాష్ట్రపతి అయ్యారు*

మనిషిగా జన్మించినపుడు, మనకంటూ
ఒక  *సిగ్నేచర్* ,మన కంటూ ఒక  *గుర్తింపు*
సంపాదించాలి

ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నా ఏమి ఫలం
చంద్రుడొక్కడుంటే చాలు, అంటాడు ఒక
సినీ గేయ రచయిత

బెరడు వృక్షాలు ఎన్ని ఉన్నా ,
అవి ఎంత పెద్ద తరువులైనా ఏమి లాభం
టేకు చెట్టు ఒక్కటున్నా చాలు

తాటి చెట్టు ఎంత ఎత్తు పెరినా
తొంబది యేండ్లు బ్రతికినా ఏమి ప్రయోజనం
చేతులకు అందునట్లు విరబూస్తూ కాత కాయు
ఫలాలను అందించు నొక్క మామిడి తరువు
ఎంతో మేలు

మనిషి కష్ట పడి లేదా అవినీతితో, కోట్లు సంపాదించినా
పోయే టప్పుడు నీ వెంట ఏమీ రాదు అనేది
నగ్న సత్యం
నీవు చేసిన మంచి తనం, నీవు చూపిన
మంచి గుణమే
నీ వెంట వస్తాయనేది పచ్చి నిజం!

అందుకే అంటారు పెద్దలు:
*పంది లాగా పదేండ్లు బ్రతికే కన్నా*
*నందిలా నాలుగేళ్ళు బ్రతికినా చాలనీ*

గౌతమ బుద్ధుడు స్వామి వివేకానంద,
శ్రీనివాస రామానుజన్ , మరెందరో
అతి చిన్న వయసులోనే మరణించినను
ఒక సిగ్నేచర్ , ఒక *చెరగని ముద్ర* వేశారు
జనులలో గొప్ప గుర్తింపు పొంది, చరిత్రలో
స్థిర స్థాయిగా నిలిచి పోయారు

శృంగార లోలుడైననూ,వేమన తన పశ్చాత్తాప
పద్యాలతో ఒక సిగ్నేచర్ పొందగలిగాడు
నట సార్వభౌముడు ఎన్టీఆర్ , సినీ రంగంలో
రాజకీయ రంగంలోనూ ఒక గొప్ప గుర్తింపు
పొంది చరిత్రలో నిలిచి పోయాడు

మంచి మనసు, మంచి మాట, మంచి గుణం
మంచి నడవడిక, మంచి వ్యక్తిత్వం గలగి
చక్కని సంస్కృతి సాంప్రదాయాలు గలవారు
ఎదుటి వారి హృదయాలలో *చెరగని ముద్ర*
వేయగలరు. చెరగని సంతకంతో
వారి గుండెలో కోవెలెను నిర్మించ బడగలరు

చక్కని వ్యక్తిత్వం గల వారు సరియైన
నిర్ణయాలు తీసుకోగలుతారు

    

No comments: