Wednesday, January 29, 2025

వేటూరి సుందర రామమూర్తి

అంశం: వేటూరి


శీర్షిక: *సినీ గేయ రచయిత వేటూరి*

గొప్ప సినీ గేయ రచయిత
సినీ గేయ రచయిత వలననే
జనులెల్లరకు పరిచయం
అతడే వేటూరి సుందర రామమూర్తి

పుట్టినిల్లు కళ్ళె పల్లె
మెట్టినెల్లు  హైదరాబాద్
విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ మద్రాసులో
డిగ్రీ చదివారు బెజవాడలో

వేటూరి కవి , రచయిత, సంపాదకులు
జర్నలిజం చదివి పాత్రికేయుడిగానూ
మొదటి సినిమా *ఓ సీతామాలక్ష్మి* ద్వారా
సినీ రంగ ప్రవేశం చేసి
నాలుగు దశాబ్దాలు సినీ రంగాన్ని ఏలారు

చక్కని పద బంధాలు, అలంకారాలతో
అలవోకగా వేన వేలు ఉత్తమ పాటలు వ్రాసి
ప్రజల హృదయాలలో చెరగని *సిగ్నేచర్* వేయగలిగాడు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు
డాక్టరేట్ బిరుదుతో ఘనంగా సత్కరించింది
అనేకమైన నంది అవార్డులను, చలనచిత్ర,
ఫిలిం ఫేర్ అవార్డులను పొందారు

శ్రీ శ్రీ తరువాత తెలుగు పాటకు జాతీయ
చలనచిత్ర అవార్డును తెచ్చి పెట్టింది వేటూరినే
అదే సమయంలో, పూర్వ కాలపు తెలుగుకు
గుర్తింపు ఇవ్వడం లేదని ఆ అవార్డును
తిరస్కరించింది కూడా వేటూరీనే

గొప్ప సినీ గేయ రచయిత వేటూరి గారు
తన డెబ్బదినాల్గవ యేట గుండె పోటుతో హైదరాబాద్ లో  సద్గతి చెందారు
             
               

No comments: