Wednesday, January 29, 2025

ఆ ఒక్క మాట కోసం

అంశం: ఆ ఒక్క మాట కోసం


శీర్షిక:  *మాట రెండు వైపులా పదునైన ఖడ్గం*

కాలు జారితే గాయం అవుతుంది కావచ్చు
కొంత బాధతో నైనా బాగు చేయవచ్చు
కానీ మాట జారుతే సర్వం కోల్పోతాం
అదే మంచి మాట, ప్రోత్సాహక మాటైతే
విశ్వ జగత్తును గెలవ వచ్చు
అందుకు ఉదంతాలు చరిత్రలో కోకొల్లలు

మంచి మాటలు జీవితాలను నిలబెడుతాయి
చెడు మాటలు జీవితాలను కూలదోస్తాయి
దేశాల మధ్య మాటా మాటా పెరుగుతే
పంతాలకు పోయి యుద్ధాలకు దారితీస్తాయి

మాటే మంత్రం , మాటే తంత్రం
ఒక సారి మాట ఇస్తే వెనక్కి తీసుకోవడం కష్టం
అది మంచిదైనా , చెడుదైనా
అది విమర్శైనా, సద్విమర్శైనా

మయసభలో  శకుని వేసిన ఎత్తుగడలకు
తలొగ్గి ఇచ్చిన మాట కోసం ధర్మ రాజు,
జూదం ఆడి, ఓడి సర్వస్వాన్ని కోల్పోతాడు
పంచ పాండవుల భార్య ద్రౌపదికి
వస్త్రాపహరణ జరిగి అవమానం
పాలవుతుంది

ఇంద్రుడు మారు వేషతో వచ్చి చేసిన పాపాన్ని
గమనించిన భర్త గౌతమ మహర్షి, అహల్యను,
నీవు బండగా మారుతావని శపించాడు.
నా వలన ఏ తప్పు జరుగలేదు,శాప విముక్తి
కొరకు దుఃఖంతో అహల్య వేడుకొనగా,
రాముడి పాద స్పర్శతో శాప విముక్తి
కలుగు తుందని మాట ఇస్తాడు
ఆ ఒక్క మాట వలన, రాముని పాదస్పర్శతో
అహల్యా దేవికి  అరణ్యవాసం కాలంలో
విముక్తి కలుగుతుంది

తండ్రి మరో వివాహం కొరకు భీష్ముడు
నేను పెళ్లి చేసుకోను అని చెప్పిన
ఒక్క మాట కోసమే జీవిత కాలం బ్రహ్మచర్యం
వహిస్తాడు

గురువు ద్రోణాచార్యుడికి ఇచ్చిన
ఒక్క మాట కోసం , ఏక లవ్యుడు
తన కుడి చేతి బొటన వ్రేలును, జలజలా
రుధిరం కారుతున్నా గురు దక్షణగా ఇస్తాడు

కర్ణుడు , తాను తమ విధేయుడనని
చెప్పిన ఒక్క మాటకు , కురుక్షేత్ర యుద్ధంలో
దుర్యోధనుడి పక్షానే నిలుస్తాడు
దానకర్ణుడినని చెప్పిన ఒక్క మాటకే
బంగారు గిన్నెను కృష్ణుడికి ఇస్తాడు
కవచ కుండలాలను దేవేంద్రుడికి
అర్పిస్తాడు

మాట రెండు వైపులా సదునైన పదునైన
ఖడ్గం లాంటిది
వెల కట్టలేనిది, అమూల్యమైనది
కొందామన్నా దొరుకనది
ఆచి తూచి వాడుదాలి, విశ్వశాంతికి
పాటు పడాలి

   

No comments: