అంశం: నేతాజీ
పేరు: మార్గం కృష్ణ మూర్తిశీర్షిక: *జైహింద్ నినాద సృష్టి కర్త*
అతనొక మేధావి
క్రమ శిక్షణ గలవాడు
నిష్కళంక దేశ భక్తుడు
సాయుధ పోరాట యోధుడు
ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు
బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగం చేయడం
ఇష్టం లేక, దేశ సేవ కొరకు సివిల్ సర్వీసునే
త్యజించిన త్యాగధనుడు!
*లక్ష మంది యువకులను నా చేతికిస్తే*
*స్వాతంత్ర్యం నేను తీసుకొస్తాను*
అని శపధం చేసిన ధీరుడు
లక్షలాది మంది ప్రజలు
పిట్టల్లా రాలిపోతున్నారనీ
శాంతి మార్గం, సత్యాగ్రహ మార్గం వలన
ఆలస్యమవుతుందనీ
పోరాట మార్గమే దీనికి ఉత్తమమని
తేల్చి చెప్పిన ఘనుడు!
దెబ్బకు దెబ్బ , రుధిరానికి రుధిరం
దేహానికి దేహమే సరియైన సమాధానమని
రెండవ ప్రపంచ యుద్ధంలో పట్టుబడిన
భారతీయ బ్రిటీష్ సైనికులను అప్పగించగా
వారితో *ఆజాద్ హింద్ ఫవుజ్* ను
స్థాపించారు
*జలియన్ వాలా బాగ్* ఉదంతంలో
ఉత్తేజం గల నినాదాలతో యువకులలో
ఉత్సాహాన్ని నింపారు
*చలో ఢిల్లీ*
*మీ రక్తాన్ని నాకు ఇవ్వండి*
*స్వాతంత్ర్యం నేను తీసుకొస్తాను* అని
*జైహింద్* నినాద సృష్టి కర్త
సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా పోరాడారు
గాంధీతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు
బ్రిటిష్ ప్రభుత్వం చేత అరెస్ట్ కాబడినాడు
పలుమార్లు జైలుకు వెళ్ళారు
చివరకు అనారోగ్యం పాలయ్యారు
తన పోరాటంలో భాగంగా, బ్యాంకాక్ నుండి
టోక్యో కు ప్రయాణిస్తున్న సమయంలో
విమాన ప్రమాదం జరిగిందని చెబుతారు
ఇప్పటికీ వారి అదృశ్యం ఒక మిస్టరీ గానే
మిగిలి పోయింది
ఏదిఏమైనా ఇప్పటికీ ఎప్పటికీ
*నేతాజీ సుభాష్ చంద్రబోస్*
భారతీయ ప్రజల గుండెలలో శాశ్వతంగా
నిలిచి పోయిన, చిరస్మరణీయుడు
No comments:
Post a Comment