అంశం: *కాలం వేగానికి కళ్ళెం వేద్దామా*
శీర్షిక: *కాలాన్ని బంధిస్తే**సూర్య కిరణాలను చేట తోటి,*
*కాలం వేగాన్ని కళ్ళెంతో బంధించ లేము*
*కూరలో అల్లం, పల్లెంలో భోజనం*
*తలుపుకు గొళ్ళెం*
*పంచకళ్యాణికి కళ్ళెం* వేయవచ్చునేమో గానీ
*కాలం వేగానికి కళ్ళెం వేయడం* అసాధ్యం
*ఈ సృష్టి రహస్యాన్ని, ప్రకృతిని ఛేదించడం*
*ఎవరి తరం కాదు!*
అంతేకాదు!కాలం వేగానికి పరుగులు తీయడం
మానవాళికి ఎవరికి సాధ్యం కాదు
ఈ విశ్వానికి, సృష్టి స్థితి లయ కారకులైన
బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సాధ్యమేమో!
కాలాన్ని బంధిస్తే, ఈ విశ్వ జగత్తు
ఈ విశ్వ సృష్టి స్తంభించి పోవు
అప్పుడు ఈ జీవకోటి , ఈ మానవాళి
బ్రతికి బట్ట కట్టుట విచిత్రమే!
"కాలం" తాళం లాగా ఒక వస్తువు కాదు
"కాలం" వాలం లాగా ఒక ఆయుధం కాదు
"కాలం" శూలం లాగా శివుడి అస్త్రం కాదు
"కాలం" తాళం రాగం లాగా సంగీతం కాదు
"కాలం" హాలం లాగా దున్నే నాగలి కాదు
"కాలం" గాలంలా చేపలు పట్టు వస్తువు కాదు
"కాలం" జాలం లాగా జంతు సమూహం కాదు!
ఆచంద్రతారార్కం
భూభ్రమణం భూ పరిభ్రమణం
ఉన్నంత కాలం
పంచభూతాలు ప్రకోచింపనంత కాలం
కాలం వేగం ఆగదు
పగలు రాత్రి ఏర్పడక మానవు!
*కాలం వేగాన్ని పొదుపు చేయడం సాధ్యమే*
కానీ *అదుపు చేయడం అసాధ్యం*
కాలాన్ని పొదుపుగా వాడుకోవడం వలన
కాలం వేగాన్ని జయించ వచ్చు!
సంధ్యవేళ భోజనం చేసి నిద్రించి
బ్రహ్మ ముహూర్తంలో లేచినా
పగటి పాన్పును నిలిపి వేసినా
అనవసర విషయాలు ఆలోచించడం
మానివేసినా
కాలం విలువ నెరిగి పని వేగాన్ని పెంచినా
సమయాన్ని సమర్ధవంతంగా వాడుకోవడం
అలవర్చు కున్నా
చేసే పనిని రెండు సార్లు చేయకుండినా
క్రమ శిక్షణతో ముందు చూపుతో
పనులు చేయడం అలవర్చుకున్నా
కాలాన్ని సమర్ధవంతంగా సద్వినియోగం
చేయడం సాధ్యమే!
No comments:
Post a Comment