Monday, January 6, 2025

కార్తీక మాసం మహాత్యం

అంశం: *సెల్ఫీ కవిత *

శీర్షిక: *కార్తీక మాసం మహాత్యం*


కార్తీక మాసంబు పూజలకును శుభంబు
ఉపవాసాలు చేయుటకు దేదీప్య మాసంబు
శుభప్రద దినములకు మంచి ముహూర్తాలకు
వివాహాలు జరిపించ నూతనపు జంటలకు!

తెలుగు సంవత్సరంలో తెలుగు మాసంబులలో
ఎనిమిదవ మాసంబు కార్తీక మాసములో
నిండు పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రమున
చంద్రుడు కృత్తికతో కలిసి మొదలగు కార్తీకము!

శివుడు విష్ణువులిరువురికి హిందూ ప్రజలందరికి
కార్తీక మహత్యంబు పూజా ఉపవాసములకు
పుణ్య క్షేత్రాలన్నియు పవిత్రపు నదులన్నియు
కళకళలాడుతుండు గుడులు గోపురాలన్నియు!

ఆయురారోగ్యాలకు సుఖసంతోషములకు
ఉత్తమమైన మాసము
ప్రజలు వృద్ధి చెందుటకు
కార్తీక మాసమందున పూజా ధ్యానము చేసిన 
జనులకు గౌరవం పెరుగును
ఇది మన భారతీయ సంస్కృతి
కార్తీక మాసమందు ఉపవాసముండిన
కోటి దీపాలు వెలిగించిన
వేద పండితులతో పూజలాచరించిన
కలుగు సుఖ సౌఖ్యాలు, ఆయురారోగ్యాలు
అష్టైశ్వర్యాలు

No comments: