Saturday, January 25, 2025

గోదావరి/అంత్యానుప్రాసాలంకారాలు

అంశం: అంత్యానుప్రాస అలాంకారాలు


శీర్షిక: *గల గలా గోదావరి*

గల గలా పారే గోదావరి
గోదావరి మీదనే బస్సులు వెళ్ళే దారి
మోటారు సైకిళ్లు వెలుతాయి సందులో దూరి
అందులోకి రోజూ వెలుతాడు జాలారి
గోదావరిలోకి దిగడానికి ఉంటుంది మెట్లదారి
స్నానాలు చేస్తారు గోదావరి చేరి
పిల్లలు ఈత కొడుతారు అందులో దూరి
పూజలు చేస్తారు అయ్యవార్లు చేరి
మంత్రాలను చదువుతారు హోరా హోరి
పెద్దలకు పిండాలు పెడుతారు అక్కడికి చేరి
కాకులు అరుస్తుంటాయి చేరువగా చేరి
పూజా సామాగ్రి కొనమంటారు మరిమరి
గోదావరి కట్ట క్రిందనే సన్నని మోరి
చెత్తాచెదారం ఉంటుంది అందులో చేరి
గోదావరి కట్ట ప్రక్కనే హోటల్లో పూరి
డబ్బు చెల్లిస్తుంటే గుర్తు కొస్తాడు హరి
నది ప్రక్కనే రైతులు పండిస్తారు వరి
బియ్యం తీస్తారు రైతులు వడ్లను నూరి
అనేక విధాలుగా ఉపయోగపడుతుంది గోదావరి
గోదావరి ముగుస్తుంది సముద్రంలో చేరి

        

No comments: