అంశం:చిత్ర కవిత
శీర్షిక: *శాపమో - వరమో!*
ఆరు అణాల పల్లెటూరి పడుసు
దాటిందిప్పుడే పదహారేళ్ళ వయసు
ఇంద్రధనుస్సులా అందాలొలికే సొగసు
వెళ్ళేది కుంభమేళ అని ఖచ్చితంగా తెలుసు!
అపురూప సుందరమైన రాణి
చెక్కిలి గింతలు పెట్టే అందాల పూబోణి
మేను నిండుగా వేసింది రంగురంగుల ఓణి
తళతళ మెరిసే పళ్ళతో పలుకులు మధుర వాణి!
చిలుకలా అమాయకపు చూపులతో
కమల పద్మాల వంటి తేనే కనులతో
ముసిముసి పసిడి చిరు నువ్వులతో
తరుణి అమ్ముతూ కనబడింది పూసలతో !
సెల్ఫీలకు గుమిగూడిరి జనులు
తగ్గిపోయే పూసల అమ్మకాలు
భీతిల్లిరి జనులతో తల్లిదండ్రులు
అప్పుడే చేరిరి మీడియా ఘనులు!
వివరాలు అడిగి తెలుసుకునిరి
గొప్ప భవిష్యత్తు ఉందని చెప్పిరి
అన్నదమ్ములు ఎంతో భయపడిరి
వ్యాపారం వదిలి ఇంటికి తోలుకుని పోయిరి!
మీడియా ఇంటికి వరుస కట్టిరి
సినిమాలలో అవకాశమిస్తామనిరి
మొనాలిసాను ఆకాశానికి ఎత్తుకునిరి
*శాపమో - వరమో* భవిష్యత్తే నిర్ణయించాలి!
No comments:
Post a Comment