శీర్షిక: *స్వతంత్ర భారత దేశం*
(గణ తంత్రము, జన తంత్రము)
గ *గ* న మందు ఎగురుచుండు నిత్యం మువ్వొన్నెల జెండా , కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, ఆకు పచ్చ సాఫల్యతకు
ర *ణ* ము కోరదెపుడు , మైత్రి కొరకు తహతహలాడు నా పవిత్ర భూమి
కు *తం* త్రాలు కుట్రలు యెరుగని పుణ్యభూమి నాదేశం ఈ విశ్వ జగత్తులో
చి *త్ర* విచిత్రాలకు కొలువైన మేటి నా భారత దేశం
స *ము* చిత నిర్ణయాలకు నెలవైన గొప్ప దేశం, వందల వేల నాటి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్న దేశం
గ *జ* గజ వణికిస్తున్న చలిలోనూ పోరాడే ధీరత్వం గల దేశ భక్తి గల సైనికులు
ది *న* దినం అభివృద్ధిని కాంక్షించే పాలకులు, కర్షకులు మరియు శ్రామికులు
మ *తం* కులం , ప్రాంతం, భాషా వైషమ్యాలు లేని సెక్యులర్ దేశం
మి *త్ర* భావం శాంతిని నెలకొల్పు పొరుగు దేశాలతో, నేడు ప్రపంచ దేశాలన్నీ చూస్తుండే భారత దేశం వైపు
మ *ము* గన్న మాతృదేశం "స్వతంత్ర భారత దేశం" , ఇది భారతీయులకెంతో గర్వ కారణం
No comments:
Post a Comment