Wednesday, January 29, 2025

రాష్ట్ర పతి కావాలని ఉంది

శీర్షిక: *రాష్ట్ర పతి కావాలని ఉంది*

మనసు కలవరపెడుతుంది 
నిద్ర లోనూ కల లోనూ 
మదిని నిత్యం తొలుస్తుంది
అదే అదే పదే పదే 

ఎన్నో ఆశలతో మరెన్నో ఊసులతో 
పోరాడి పోరాడి, వెంటాడి వేటాడి 
త్యాగాలు చేసి, ప్రాణాలు అర్పించి
సాధించిన ఫలితం లేకపోయే 

యేండ్లు దాటినా 
దశాబ్దాలు గడిచినా 
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందాన 
సాగుతుండే జనుల జీవన గతులు
చెత్త కుండీల వద్ద శునకాల పోట్లాటలా 

ప్రతి యేటా ప్రభుత్వాలు 
లక్షల కోట్ల ఉచిత పధకాలను ప్రకటిస్తూ
పేదలకు అమలు చేస్తారు
యేడు గడిచే సరికి అదే బడుగు జీవులు 
బొచ్చెలు పట్టుకుని చకోరపక్షుల్లా 
నగదు పధకాల కొరకు ఎదిరి చూస్తారు 
హక్కుల సాధన మరిచి పోతారు 

ఎక్కడ పోతుండే లక్షల కోట్ల నిధులు
ఎవరి బొజ్జలు నిండుతుండే 
దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోగా
బీదలు ఓటు బ్యాంకు గానే మిగిలి పోతుండే

నా ఊహా రాష్ట్రపతి కావాలనీ, 
*ప్రతి ఐదేళ్లకు ఒకసారి దేశంలో*
*రాష్ట్రపతి పాలన విధించాలని* 
అప్పుడు ప్రభుత్వ నేతలలో, 
బ్యూరో క్రాట్లలో వణుకు పుడుతుంది 
సత్వరం చట్టాలన్నీ అమలులోకి వస్తాయి 
అవినీతి తగ్గుముఖం పడుతుంది 
నాయకులు ఉచితాలను ఆపేస్తారు
ప్రజలు స్వయం ఉపాధితో 
అభివృద్ధి సాధిస్తారు 
ఆత్మాభిమానంతో జనులు జీవిస్తారు

No comments: