Sunday, January 12, 2025

ఇలవేల్పు/గ్రామ దేవత మొక్కులు

అంశం: ఇలవేల్పు
శీర్షిక: గ్రామ దేవత మొక్కులు

సంస్కృతి సాంప్రదాయాలకు
పుట్టినిల్లు భారత దేశం
అవి వేలు లక్షల సంవత్సరాల నుండి
వస్తున్న ఆచార వ్యవహారాలు!

ప్రతి మనిషికి ఉంటాయి
ఏవేవో లక్షా తొంభై సమస్యలు
బాధలు కష్టాలు దుఃఖాలు రోగాలు
వాటిని తీర్చుకోవడానికి
రేపు ఏ ఆపద రాకూడదని
ఒక్కొక్కరిది ఒక్కోదారి
డబ్బున్న వారు ప్రయివేటుహాస్పిటల్ కు
డబ్బులేని వారు సర్కారు దవాఖానాకు
ఆస్తికులు గుడులకు దేవాలయాలకు
గ్రామ దేవతల వద్దకు వెళ్తారు
ఇంటి దేవత ఉప్పలమ్మను కొలుస్తారు
నాస్తికులు మూఢనమ్మకాలని కొట్టి పారేస్తారు!

ఎవరి నమ్మకాలు అపనమ్మకాలు వారివి
ఎవరి బాధలు  కష్టాలు వారివి
ఎవరి దుఃఖాలు అనారోగ్యాలు వారివి
ఎవరి మొక్కులు  అవసరాలు వారివి!

మొక్కులు తీర్చుకోక పోతే
ఏదో జరుగుతుందన్న భయం
అప్పు సప్పు చేసైనా ఎంత ఖర్చు అయినా
అది ఎంత దూరం అయినా
ఇలవేల్పు మొక్కులుతీర్చుకుంటారు భక్తజనం!

No comments: