అంశం: దరిద్దామా...ధైర్యపు చొక్కాను
శీర్షిక: గుండె ధైర్యంతో తరిమి కొడుదాం
ప్రజల నమ్మించే మోసగాండ్ల
ఉచితాలని ఊదరబెడుతూ
హామీలిస్తూ అమలు చేయని
ఆరితేరిన ఖద్దరు దారుల
ధరణి నుండి తరిమి వేయ!
భూకబ్జాలు చేసే భూబకాసురుల
స్కాములు చేసే దుష్టబుద్దుల
వృద్దులైనా ఎన్నికల్లో వ్రేళ్ళాడే నేతల
ప్రజలను పేదలుగ మార్చి
ఓటుకు నోటిచ్చి అధికారపీఠమెక్కి
ఓటర్లనే తప్పుబట్టే కీచకుల
అవనిలోనే అదిమిపెట్ట!
కండ కావురముతో
కవ్వించే శత్రు సైనికులను
మాతృదేశంపై కాలు దువ్వే కుతంత్రుల
కుట్రలు పన్నే విదేశీ శక్తుల
కూకటి వేళ్ళతో పెరికి వేయ
దరిద్దాం...ధైర్యపు చొక్కాను
గుండె ధైర్యంతో తరిమి కొడుదాం
దేశ ఔన్నత్యాన్ని నిలుపుదాం
రేపటి తరానికి ఆదర్శంగా నిలుద్దాం!