Wednesday, February 19, 2025

ఊహల పల్లకిలో ప్రగతి

అంశం: అభ్యుదయం



శీర్షిక: *ఊహల పల్లకిలో ప్రగతి*

ఊహల పల్లకిలో జగతి
ప్రజలకు పోతుంది మతి
బడుగు జీవులలో లేక ప్రగతి
మేధావులు మేల్కోక పోతె అధోగతి!

అభివృద్ధి అంటే
ఆకాశహార్మ్యాలు కాదు
రోడ్లు బ్రిడ్జీలు, వంతెనలు కాదు
గగనతలంలో ఎగిరే వ్యోమయానాలు కాదు
అభివృద్ధి అంటే పేదల ఆర్ధిక జీవన స్థితిగతులు!

ఏడు దశాబ్దాలు దాటినా
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
ఎదుగుతున్నారు నేతలు యదేచ్చగా
చట్టాల లొసుగుల ముసుగులుగా వేసుకుని!

ఎన్ని సార్లు ఎన్నికలు జరిగినా
ఏముంది గర్వ కారణం
కొత్త సీసాలలో పాత బీరునే
లేబుళ్లు మారుతున్నాయి కానీ
లోపల బూజు పట్టిన బీరునే!

రిజర్వేషన్లు పదేళ్ళ వరకే నని చెప్పారు
నాడు డాక్టర్ అంబేద్కర్ గారు
డెబ్బది ఏడేళ్లు దాటినా
కొనసాగుతూనే ఉన్నాయి అర్హతలు!

నేను నమ్ముతున్నాను
దేశం అభ్యుదయం దిశగా పయనిస్తుందని
*ఐదేళ్ల కొకసారి రాష్ట్రపతి పాలన విధిస్తే*
బడుగు జీవుల బ్రతుకులు మారుతాయని!

          

No comments: