Thursday, February 20, 2025

తెలంగాణ తల్లి/ భాషలందు తెలుగు లెస్స

అంశం: *మాతృభాష వైభవం*

            (చిత్ర కవిత)

శీర్షిక: *దేశ భాషలందు తెలుగు లెస్స*

కళకళ లాడుతోంది తెలుగు తల్లి
తల్లి మెడలో మల్లెల హారం సుందర మనోహరం
ఉట్టిపడే మోము ప్రశాంతతకు ప్రతిరూపం
ముదురు ఎరుపు పట్టుచీర శౌర్యానికి ప్రతీక
నుదుట సిందూరం భారతీయ సంస్కృతికి ఆనవాలు
శిరస్సుపై దగదగ మెరిసే బంగారు కిరీటం
కుడి చేతిలో కళశం, ఎడమచేతిలో పంటల పరవల్లు
అబ్బురపరిచే నల్లని కురులు దృడ సంకల్పానికి సంకేతం

చేయి చేయి కలుపుదాం
తెలుగు వర్ణమాలతో విన్యాసాలు చేద్దాం
దేశంలో ఐక్యతను పెంచుదాం
నవ సమాజాన్ని నిర్మిద్దాం

గలగల పారే గోదావరి సిరులు
మిలమిల మెరిసే నింగిని తాకిన తారలు
ఘుమ ఘుమ లాడే విరిసిన సిరి మల్లెలు
మృదు మధురమైన జుంటి తేనే నా తెలుగు!

పరభాష ద్రావిడ భాషలో పుట్టింది బీజం
భారత పుడమి లోన విరిసిన రాజము
సమస్త ప్రపంచానికి విస్తరించిన తేజం
తేనె లొలుకు భాష నా తెలుగు భాష!

తెలుగు భాష తీయదనం
తెలుగు జాతి గొప్పతనం
ఏ భాష వారికైననూ సహితం
నచ్చుతుంది అందులోని కమ్మదనం
అందుకే అంటారు శ్రీ కృష్ణ దేవరాయలు
*దేశ భాషలందు తెలుగు లెస్స అని*

నిండు పౌర్ణమి నాటి చల్లని చందమామ
పంట చేనుపై రంకెలేస్తున్న గొల్ల భామ
చంటి బిడ్డకు కడుపు నింపిన తల్లి ప్రేమ
*ది ఇటలీయన్ ఆఫ్ ది ఈస్ట్* అని
విదేశీకవులు కీర్తించిన గొప్ప భాష తెలుగు!

తెలుగు భాషను గుర్తించిరి ప్రాచీన భాషగా
హిందీ బెంగాలీ తరువాత అధిక ప్రజలు
దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు
ప్రతియేటా ఆగష్టు ఇరువై తొమ్మిదిన
తెలుగు భాషా దినోత్సవముగ జరుపుకుంటాం
అది గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినం
         
          

No comments: