Sunday, February 2, 2025

మరణమే శరణ్యమా?

శీర్షిక:  "మరణమే శరణ్యమా?"


హతఃవిధీ, 

ఏమిటీ దృశ్యం 

హృదయవిధారకం 

నేడు మనిషి జీవితం 

ఎటుపోతుంది ఈ సమాజం 

ఏమైపోతుంది ఈ సమాజం 

మసక బారి పోతుందా మానవత్వం!


నాటి ఉమ్మడి కుటుంబాలు

పచ్చని తోరణాల్లా విరాజిల్లాయి

నేడు న్యూక్లియర్ కుటుంబాలు 

మంటల కుంపటి అయ్యాయి

ప్రేమలు ఆప్యాయతలు ఆవిరై పోయాయి!


ఏమిటీ దుస్థితి, ఎందుకీ పరిస్థితి 

ఎవరు కన్న బిడ్డనో ,ఎవరికి కన్న తండ్రినో 

బ్రతికి ఉండగానే, ఊపిరి బిగబట్టి దుఃఖిస్తూ

ఒంగిన భుజాలు, కృంగిన జవసత్వాలు 

దిక్కు మొక్కు లేని ఓ అనాధలా

తన చితికే తాను నిప్పు పెట్టుకునెలా!


తల్లి బిడ్డను తొమ్మిది నెలలు కడుపున మోస్తే 

తండ్రి జీవితాంతం తన గుండెలో మోస్తాడు! 


గొడుగు ☔ లో , తల్లి హాండిల్ అవుతే 

పిల్లలు గొడుగు పుల్లలు 

తాను వానకు తడుస్తూ,ఎండకు ఎండుతూ 

భార్యా పిల్లలు వానకు తడవకుండా

ఎండకు మాడ కుండా , 

నిరంతరం సురక్షితంగా కాపాడే పై కప్పు ,తండ్రి! 


కష్టించి , డొక్క మాడ్చుకుని 

రూపాయి రూపాయి కూడ బెట్టి

పిల్లలను చక్కగా చదివిస్తే

పెరిగి పెద్దయ్యాక, డాలర్ల మోజులో పడి

కన్న తల్లి దండ్రులనే కాదనుకునిరా!


భార్య వియోగం చెందగా ఒంటరి వాడై

కన్న బిడ్డలు దూరమవగ  బ్రతుకు భారమై 

తనకు తానే పేర్చుకున్న మరణ శయ్యపై

కూర్చుని తానే నిప్పు పెట్టుకుంటుండె రోదనై!


కష్టాలు బాధలు మానవుడికి గాక 

మాకుకు వస్తాయా ?

ఇంటింటికీ మట్టి పొయ్యే , అందరికీ ఉంటాయి

చెప్పుకోలేనన్ని సమస్యలు

మరణమే దానికి శరణ్యం అనుకోవడం 

మహా పాపం

ఈ ప్రపంచం చాలా విశాలం బ్రతకడానికి 

మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది

ఎవరు ఉన్నా లేకున్నా , ఎవరు కాదన్నా

ఒంటరి వారైనా, ఒడిదొడుకులు ఉన్నా

ఉత్సాహంగా జీవించడం అలవర్చుకోవాలి! 


అందుకు ముందు నుండే 

*ధనం మూలం ఇదం జగత్*

డబ్బును, సంపదలను కూడబెట్టుకోవాలి

వయసు ఉడిగే వరకు అవి మీ పేరు మీదనే ఉంచుకోవాలి

బంధు మిత్రులతో పరిచయాలు పెంచుకోవాలి

నిరంతరం ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి! 

పార్ట్ టైం ఉద్యోగం, సమాజ సేవ, సాహిత్యం

యూట్యూబ్ ఛానల్, నటన, నృత్యం 

రచనలు, ఫ్రీ లాన్సర్స్ , యోగ, మెడిటేషన్ 

ఆన్లైన్ క్లాసెస్  మరేదైనా ఎంచు కోవచ్చు

చావు కంటే బ్రతకడమే చాలా సులభం 

మరణం పిరికి వారి హీన లక్షణం

బలహీనతలనధిగమిస్తే చావు దూరమౌతుంది

మనపై మనం విశ్వాసం పెంచుకుంటే 

జీవించాలనే ఆశ చిగురిస్తుంది! 

           

No comments: