Monday, February 24, 2025

మెహర్ బాబా

అంశం: అవతార్ మెహర్ బాబా



శీర్శిక: మెహర్ బాబా ఒక తాత్విక వేత్త

ఆధ్యాత్మిక గురువు
సహజనులకు సద్గురువు
జగానికి జగద్గురువు
విశ్వానికి విశ్వ గురువు
అతడే లోకాన మహా గురువు!


మెహర్ బాబా ఒక తాత్విక వేత్త
మంచి మనసున్న మనసిక వేత్త
లోకజ్ఞానం నెరిగిన మహా జ్ఞాని
జనులకు జ్ఞానాన్ని బోధించిన విజ్ఞాని!

రోగులకు కుష్టు రోగులకు సేవలందించాడు
ఆర్ధిక సామాజిక మానసిక సమస్యలకు
సాక్షాత్తు దైవంగా స్వాంతన కల్పించాడు
దేవుడు ఒకడే అని నమ్మిన ఆత్మ జ్ఞాని!

కొంత కాలం అక్కడక్కడా ఊరూరా
ప్రసంగాలు చేస్తూ గురుబోధ చేస్తూ
మహిమలు చూపెడుతూ భక్తులకు చేరువయ్యాడు
వృద్ధాప్య దశలో మౌనమునిగా మారి
లిపి లేని భాషతో ఆరాధ్యుడయ్యాడు
ఇప్పటికీ మహారాష్ట్రలో ప్రజలు కొలుస్తారు!

ఎక్కడ పుట్టాడని ఎక్కడ పెరిగాడని కాదు
బురుదలో పుట్టిన తామర విష్ణువు
పాదాల చెంతకు చేరినట్లు
భక్తుల గుండెలలో కొలువై ఉన్నాడు మెహర్ బాబా!

No comments: