శీర్శిక: సకల కళా పోషకుడు ఆంధ్ర భోజుడు
ఆంధ్ర భోజుడు అఖిలాండకోటి నాయకుడు
సర్వసంపన్నుడు , సకల కళా పోషకుడు
ఆర్ధిక నిపుణుడు, బుజభల సంపన్నుడు
మహా పండితుడు, మహావిష్ణువు ఆరాధకుడు
విజయనగర సామ్రాజ్య పాలకుడు
గొప్ప రాజనీతిజ్ఞుడు, శ్రీకృష్ణ దేవరాయలు!
సంస్కృతంలో జాంబవతీ కళ్యాణం
తెలుగులో *ఆముక్తమాల్యద* రచించి
*దేశ భాషలందు తెలుగు లెస్స* అని కీర్తించిన
గొప్ప కవి పండితుడు, సకల కళా పోషకుడు
అన్య దేశస్థులచే ప్రశంసించబడిన ధీరుడు!
*సాహితీ సమరాంగణ సార్వభౌముడు* అను
బిరుదాంకితుడు
రాయల ఆస్థానమైన విజయనగరంలో
పెంచి పోషించే అష్ట దిగ్గజ కవులనెల్ల
అల్లసాని పెద్దన, నంది తిమ్మన,
తెనాలి రామకృష్ణుడు వంటి అద్భుత కవుల!
అష్ట దిగ్గజ కవులలో అల్లసాని పెద్దనకు
*గండపెండేరం* స్వయముగా తొడిగి
కవుల పల్లకి మోసి
కవులు చెప్పే పద్యాలకు , సలహాలకు
పొంగి పోయి బంగారు రత్న మాణిక్యాలను
బహుమతులగా ఇచ్చి సత్కరించి
కవులచేత, ప్రజల చేత విదేశీయుల చేత
ఎంతగానో కీర్తింపబడిన ఏకైక రాజు
కవి పోషకుడు శ్రీ కృష్ణ దేవరాయలు!
విజయనగర సామ్రాజ్య కాలంలో
శ్రీకృష్ణ దేవరాయలు పాలనలో
వీదులలో రత్నాలు రాశులు పోసి
అమ్మే వారనేదీ వాడుకలో ఉన్న మాట
ఎది ఏమైనా ఆంధ్ర భోజుడి యశశ్చంద్రికలు
దిగంతాలకు చేరాయనడంలో సందేహం లేదు!
No comments:
Post a Comment