అంశం: రెప్ప వాలని క్షణాలు
శీర్షిక: *రెప్ప వాలని క్షణాలు*
*అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల*
*నాడు కాదు* అన్నట్లు
నవమాసాలు మోసి కని పెంచి
కంటికి రెప్పలా కాపాడి
క్రమశిక్షణతో విద్యాబుద్దులు నేర్పించి ,
కళ్యాణాలు జరిపించాక పిల్లలు
లక్షల లక్షలకు సంపాదిస్తూ
కనుల ముందే తిరుగుతూ...
వారు భార్యాభర్తలు పిల్లలతో
ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ
మాతృమూర్తులను చూస్తూ,
పలుకరించకుండా, వారింట్లోని పప్పికిచ్చిన
గౌరవం కూడా ఇవ్వకుండా,జీవితం గడుపుతుంటే
పెంపకంలో ఎక్కడ లోపం జరిగిందా అని
ఆశ్చర్యమేసి , హౄదయం బండబారి
నిశ్చేష్టమైన క్షణాలు
ప్రతి రైతుకు మూడు ఎకరాల భూమిని
ఇస్తానని ఇవ్వకుండా,సర్కారు మాట తప్పినపుడు
నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తానన్నది
ఒట్టి మాటలే అని తేలినపుడు...
ఎన్నికలపుడు పేదలకు ఇండ్లు ఇస్తానని
ఇవ్వక నాన్చినపుడు...
పెన్షన్లు పెంచుతామని, పెంచకుండా
మల్లీ ఎన్నికలు వచ్చే వరకు
వాయిదాలపై వాయాదాలు వేస్తుండటంతో
*కండ్లు కాయలు కాయంగా*
చకోర పక్షుల్లా వేచి చూస్తున్న క్షణాలు..
పెద్దలకు వేల కోట్ల ఋణం మాఫీ చేసి
పేదల ఋణాలపై బ్యాంకులు
విరుచుకు పడినపుడు...
*పుండు ఒక చోట ఉంటే మందొక చోట పెట్టినట్లు*
ప్లాస్టిక్ కవర్లు తయారీ, ప్లాస్టిక్ కవర్ల దిగుమతులు
బ్యాన్ చేయకుండా, లైసెన్సులు రద్దు చేయకుండా
కిరాణా షాపులపై, కూరగాయలు అమ్మేవారిపై
చిల్లర వ్యాపారులపై ఫైనులు వేస్తున్నప్పుడు
శిక్షలు విధిస్తున్నపుడు...
కనురెప్పలు నిక్కబొడుచుకుని నిశ్చేష్టులై చూస్తుంటాయి
No comments:
Post a Comment