Thursday, February 20, 2025

ఆశల పొదరింట అలాయి బలాయి

అంశం: ఆశల పొదరింట అలాయి బలాయి

శీర్షిక: *ఆనందాలు సంతోషాలు*

*ఆశ మనిషికి శ్వాస*
మనిషికి ఆశ లేకుంటే భవిష్యత్తే లేదు
ఆశ ఉండాలి, అది సాధించుకోడానికి
ప్రయత్నం ఉండాలి!

అందమైన వసుదైక కుటుంబాలలో
అందరు కలిసి మెలిసి ఉండినను
ఆనందాలు సంతోషాలు వెల్లివిరుస్తాయి
ఆశలతో హృదయాలు అలాయి బలాయి!

కోప తాపాలు మనఃస్పర్ధలు వీడి
చీటికి మాటికి కొట్లాటలు మాని
చిన్నాపెద్దా తారతమ్యాలు వదిలి
ఒకరికొకరు ప్రేమగా ముచ్చటించుకుంటుంటే
ఆ పొదరింట ఆశల ఆనందాలు సంతోషాలు వెళ్ళివిరుస్తాయి!

తల్లిదండ్రులు పిల్లలను ప్రేమగ చూస్తూ
పెద్దతనంతో క్రమశిక్షణతో పెంచుతూ
వారి అభివృద్దిలో పాలు పంచుకుంటుటే
ఆ కుటుంబాలు ఆశల ఆనందాలు సంతోషాలతో తులతూగుతాయి!

అత్తామామలను నన్ను పోషించారా
అని కోడళ్ళు అనుకోకుండా
వారిని తమ తల్లిదండ్రులుగా భావిస్తూ
భర్త ఎవరో అని భార్య, భార్య ఎవరో అని భర్త
అనుకోకుండా అన్యోన్యంగా ప్రేమగా జీవిస్తే
ఆ యింట ఆశల పొదరిల్లు ఉప్పొంగి పోతుంది!

నేనే ఉద్యోగం చేస్తున్నాని భర్త
నేనే ఇంటి పనంతా చేస్తున్నాని భార్య
అనుకోకుండా
విభేదాలకు ఘర్షణలకు హద్దులు విధించి
ప్రేమతో పిల్లల అభివృద్ధి పై దృష్టి నిలిపి
కలిసి మెలిసి జీవిస్తే
ఆ యింట ఆనందాలు సంతోషాలు
ద్విగుణీకృతం అవుతాయి!

No comments: