అంశం: అంత్యాక్షరి
శీర్షిక: *మోక్షం పొందడం తధ్యం*
*వద్దు మనకు ఊసులు*
వాటితోనే వస్తాయి లేని పోని సమస్యలు
విలువైన సమయం వృధా అవుతుంది
మనఃస్పర్ధలు కూడా రావచ్చు
బంధుత్వాలు దూరమవచ్చు
*అందరినీ మన వారిగా భావించుకుని*
*అన్యోన్యంగా జీవించాలి*
ప్రతి మనిషి కలతలు లేకుండా జీవించాలి
అదే ప్రధమ లక్ష్యం కావాలి
పరుల శ్రేయస్సును కోరాలి
అప్పుడే *మోక్షం* పొందడం తధ్యం
*మనలోనే దైవత్వం నిండి ఉంటుంది*
దైవత్వం నిండిన వారిలో
ప్రేమ గుణం ఉంటుంది
దయా గుణం ఉంటుంది
దాన గుణం ఉంటుంది
సేవా గుణం ఉంటుంది
*మోక్షానికి దగ్గర చేస్తుంది*
అందరూ మంచి లక్షణాలు అలవర్చుకుంటే
ఆ వ్యక్తి ఒకరే కాకుండా
అందరూ మోక్షానికి దగ్గర అవుతారు
దేశం సుభిక్షంగా ఉంటుంది
అందరూ సుఖశాంతులతో జీవిస్తారు
*వారి అడుగు జాడల్లో మసలుకుని*
యువతను ఉత్తేజ పరుస్తూ
గాంధీలా వేగంగా ముందుకు నడుస్తారు
నవ సమాజాన్ని నిర్మిస్తారు
బావి తరాలకు ఆదర్శంగా నిలుస్తారు
No comments:
Post a Comment