అంశం: మై సెల్ఫీ
కవిత సంఖ్య: 59
శీర్షిక: *ఉచిత ఆరోగ్య శిబిరం*
*చేతికి ఉన్న ఐదు వ్రేళ్ళు సమానంగా ఉండవు*
*ఆ ఐదు వ్రేళ్ళు ఒకేరకంగా ఉపయోగపడవు*
*అలానే ఒక కడుపులో ఐదుగురు ,ఒకే రకమైన*
*అందం, గుణ గణాలు ఉండవు*
కానీ కొంతమంది ఉంటారు దాతలు, సేవాపరులు, దయార్ద్ర హృదయులు.
అలాంటి కోవకు చెందిన వారే *ప్రణామ్ హాస్పిటల్స్*
వీరు అమీన్ పూర్ మండలంలో
లింగమయ్య కాలనీలో
పేదలు మధ్య తరగతి ప్రజల
ఆరోగ్యం, శ్రేయస్సు కొరకు ఏర్పాటు చేసిరి
ఒక *ఉచిత ఆరోగ్య శిబిరం*
*ఆ శిభిరం పేద మధ్యతరగతి వారలకు వరం*
పేషెంట్లకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విశాలమైన టెంట్ వేసారు, కుర్చీలు వేసారు
త్రాగే నీరును అందుబాటులో ఉంచిరి
క్రమశిక్షణతో సీరియల్ నెంబర్లు ఇస్తూ కూర్చో బెట్టిరి.
సీరియల్ నెంబరుతో పిలుస్తూ,
మొదట బరువు ఆ తరువాత ఎత్తు
ఆ పిమ్మట మరొక టేబుల్ వద్ద బిపి,షుగర్ టెస్ట్
అటుపిమ్మట డాక్టర్ ఆరోగ్యం వివరణడిగి
తెలుసుకుని మందులు వ్రాయగా
మరొక డాక్టర్ జీవనశైలి గూర్చి సలహాలిచ్చే
ఇంకో టేబుల్ పై లంగ్స్ పరీక్షలు చేయగా
చకచకా చివరగా చేసిరి ఈ.సి.జీ పరీక్షలు
ఒకరికి వాడినవి ఏవీ మరొకరికి వాడకుండా
జాగ్రత్తగా అన్ని టెస్టులు చేసిరి
ఆ పైన ఇచ్చారి అవసరమైన మందులు
*అన్నీ ఉచితంగానే*
ప్రతి పట్టణాలలో, మండలంలో,కాలనీలలో
ప్రభుత్వ హాస్పిటల్స్, హెల్త్ సెంటర్లు ఉంటాయి
అప్పుడప్పుడు ఇలాంటి ఉచిత శిబిరాలు
ఏర్పాటు చేసి, ఉచితంగా మందులు ఇస్తారు
వేలకు వేలు హెల్త్ ఇన్సూరెన్సులకు కట్టి
నష్టపోయే కంటే
భరోసాతో ఏది బడితే అది జంక్ ఫుడ్స్ వంటివి
తినే కంటే, కూల్ డ్రింక్స్ , ధూమపానం,
మధ్య పానం త్రాగుతూ ఆరోగ్యాన్ని పాడు
చేసుకునే కంటే,
ముందు నుండే జీవనశైలిని మార్చుకుంటూ
ఇలాంటిప్రభుత్వ , ప్రైవేటు హెల్త్ క్యాంపులను
వినియోగించుకుని అందరు ఆరోగ్యంగా
జీవించాలి
*ఆరోగ్యమే మహాభాగ్యం*
No comments:
Post a Comment