Wednesday, February 19, 2025

ప్రశంసా పత్రాల ప్రయోజనం

అంశం: ప్రశంసా పత్రాల ప్రయోజనం


శీర్షిక: ప్రోత్సాహం

సూర్య కిరణాలు భానుడికి
ఎగిసి పడే కెరటాలు  సముద్రానికి
చల్లని వాతావరణం ప్రకృతికి
బిరుదులు , పురస్కారాలు
అభినందనలు  కవిత్వానికి గీటురాయి!

చిరు గాలికి వెల ఉంటుంది
ప్రతి వస్తువుకు ధర ఉంటుంది
ప్రతి మాటకు అర్ధం ఉంటుంది
ప్రతి పనిలో శ్రమ ఉంటుంది!

ఊరికే చెప్పే సలహాలకు విలువ ఉండదు
ఉచితంగా వచ్చే వేటికి మూల్యముండదు
అక్రమంగా వచ్చే డబ్బుకి పరువుండదు
ప్రోత్సాహం లేని రచనలకు ప్రేరణుండదు!

వరి ధాన్యాలను మరపట్టిస్తేనే బియ్యం
కౄడ్ ఆయిల్ ను శుద్దిచేస్తేనే ఇంధనం
సమతులాహారం తింటేనే ఆరోగ్యం
కవులను ప్రోత్సాహ పరుస్తేనే మంచి కవిత్వం!

No comments: