Tuesday, February 18, 2025

యోగి వేమన

అంశం: వేమన


శీర్శిక: *వేమన మహా గొప్ప కవి*

దేశంలో ఎందరో కవులు ఉంటారు
కానీ,  కొందరే ప్రజా కవులు అవుతారు
*సిగ్మండ్ ఫ్రాయిడ్* మనో విజ్ఞాన శాస్త్ర వేత్త చెప్పినట్లు 
ఎదిగే వయసులో కుటుంబంలో సంఘర్షణలు
స్నేహితుల, పుస్తకాల , సమాజ పరిస్థితుల
నెరవేరని కోరికల ప్రభావమని!

'వేమన' జీవితాన్ని తన రచనలను
విశ్లేషణ చేయగ తాను యుక్త వయసులో 
వేశ్యాలోలుడు!

మణి మాణిక్యాలు సకలం దారపోషాక
సర్వం కోల్పోయాక తెలిసివచ్చే 
చేసిన తప్పేమిటో మరిచిపోని 
గాయమేమిటో  వదిన ద్వారా 
జీవితంపై విరక్తి కలిగే కాలం కరిగి పోయే
ఒక యోగి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది
మారే వేమన, గొప్ప లోక కవిగా!

వేమన ఒక 'మహా కవి' యోగి తత్వవేత్త
అలతి అలతి పదాలతో ఆటవెలది పద్యాలు 
నాటి సాంఘిక సామాజిక రుగ్మతలను 
చీల్చి చెండాడుతూ వ్రాసే 
ప్రేయసి విశ్వద, స్నేహితుడు అభిరామ పేర్లతో
*విశ్వదాభిరామ వినురవేమ* అను మకుటంతో
సామాన్య జనుల గుండెలలో నిలిచి పోయే!

*వానకు తడవని వారు*
*వేమన పద్యాలు వినని వారు లేరు* 
అనేది ఒక ఆర్యోక్తి!

సిపి బ్రౌన్ సహకారంతో ఆటవెలది పద్యాలు 
వెలుగులోకి వచ్చే 
ఎనిమిది శతాబ్దాలు గడిచినా జనుల
నాలుకలపై నేటికీ ఆడటానికి కారణం
నాటి పరిస్థితులు నేటికీ మారకపోవడమే!

"లోక కవి వేమన" చిరస్మరణీయుడు!

No comments: